ఆ ఒక్క తప్పు చేస్తే పుష్ప2.. అట్టర్ ఫ్లాప్ అవ్వడం ఖాయమా..? జాగ్రత్త సుకుమార్..!

ఎక్కడ పాజిటివిటీ ఉంటుందో అక్కడ నెగిటివిటీ ఉంటుంది అన్న విషయం మనందరికీ తెలిసిందే . ఎక్కడ మంచి ఉంటే అక్కడ చూడు కచ్చితంగా ఉంటుంది . ఎక్కడ మనిషిని పొగిడే వాళ్ళు ఉంటారో అక్కడ మనిషిని డౌన్ ఫాల్ చేయడానికి కూడా జనాలు రెడీగా ఉంటారు . ప్రెసెంట్ సినిమా ఇండస్ట్రీలో.. సోషల్ మీడియాలో పాన్ ఇండియా లెవెల్ లో మారుమ్రోగిపోతున్న ఒకే ఒక్క పేరు పుష్ప .. పుష్ప రాజ్. పుష్ప2 సినిమా కోసం జనాలు ఎంత ఈగర్ గా వెయిట్ చేస్తున్నారో అనే విషయం గురించి మనం ప్రత్యేకంగా మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు .

ప్రాణం ఓట్టి నటిస్తున్నాడు బన్నీ . సుకుమార్ కూడా ఈ సినిమా కోసం బాగా బాగా కష్టపడుతున్నారు . కేవలం సుకుమార్ బన్ని నే కాదు సినిమా కోసం వర్క్ చేసే ప్రతి ఒక్క టెక్నీషియన్ కూడా దీన్ని సినిమాగా కాకుండా ఒక లైఫ్ గా భావిస్తున్నారు . అంత పకడ్బందీగా షూటింగ్ ప్లాన్ చేసుకొని ప్రతీది కూడా కరెక్ట్ వే లో తీసుకెళ్తున్నారు. ఇలాంటి క్రమంలోనే పుష్ప2 సినిమా గ్లోబల్ స్థాయిలో గుర్తింపు సంపాదించుకొని మరొక ఆస్కార్ ఇండియాకి తీసుకురావడం పక్క అంటున్నారు జనాలు.

అయితే పుష్ప2 పై నెగటివ్ ట్రోలింగ్ కూడా జరుగుతుంది. పుష్ప సినిమాలో కొన్ని నెగిటివ్ పాయింట్స్ ఉన్నాయి అని ..ఒకవేళ అవి యాక్సెప్ట్ చేయకపోతే సినిమా అట్టర్ ప్లాప్ అవుతుంది అని చెప్పుకొస్తున్నారు . పుష్ప 2 సినిమాలో ఆఖరిలో పుష్పరాజ్ క్యారెక్టర్ చచ్చిపోతుందట . సుకుమార్ ట్విస్ట్ వేరే లెవెల్ లో ఉండబోతుంది అంటూ ప్రచారం జరుగుతుంది . అయితే సినిమాకి కీ ఎలిమెంట్ పుష్పరాజ్. ఆ పుష్పరాజ్ చచ్చిపోతే సినిమా ఎవడు చూస్తాడు అంటున్నారు జనాలు. సినిమా ఫ్లాప్ అవ్వాలి అంటే కచ్చితంగా పుష్పరాజ్ కారెక్టర్ ని చంపేస్తాడు సుకుమార్ అంటూ దారుణంగా ట్రోల్ చేస్తున్నారు . శ్రీవల్లి క్యారెక్టర్ ఫస్ట్ ఆఫ్ లోనే చనిపోతుందట. సినిమా ఆఖరిలో క్లైమాక్స్లో పుష్పరాజ్ క్యారెక్టర్ చనిపోతుందట . ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో ఈ సినిమాకి సంబంధించి దారుణమైన ట్రోలింగ్ జరుగుతుంది..!!