బ్రేకింగ్‌: తెలుగోడిని షేక్ చేసిన ఆ విల‌న్ ఇక లేరు..

కోలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ యాక్టర్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్న డెనియల్ బాలాజీ(46) ఇటీవల కన్నుమూశారు. శుక్రవారం అర్ధ‌రాత్రి ఆయన చివరి శ్వాస విడిచాడు. చాతి నొప్పితో తీవ్ర అస్వస్థతకు గురైన డెనియల్‌ను కుటుంబ సభ్యులు చెన్నైలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలిస్తుండ‌గా.. హాస్పిటల్ కు చేరుకునేలోపే అత‌డు మరణించాడని వైద్యులు చెప్పినట్లు తెలుస్తుంది. డెనియల్ బాలాజీ తమిళ్‌తో పాటు తెలుగు, మలయాళ, కన్నడతో పాటు.. పలు తెలుగు సినిమాల్లో నటించి మెప్పించాడు. ఎక్కువగా విలన్ రోల్స్ లో కనిపించే ఈయన.. చిట్టి అనే తమిళ్ సీరియల్ తో సినీ కెరీర్‌ ప్రారంభించాడు.

டேனியல் பாலாஜிக்காக நடிகர் முரளியின் தந்தை கண்ட கனவு.. இன்னும் அது நிறைவேறாம தான் இருக்கு..

పిన్ని పేరుతో తెలుగులో డబ్ అయిన ఈ సీరియల్ ఇక్కడ కూడా మంచి పాపులారిటీ దక్కించుకుంది. ఆ తర్వాత ఏప్రిల్ మాదాతిల్, కాదల్ కొండెన్ సినిమాల్లో చిన్న చిన్న రోల్స్ లో నటించాడు. కమల్ హాసన్, గౌతమ్ మీన‌న్‌ కాంబినేషన్‌లో తెరకెక్కిన వట్టయ్యాడువినడై.. తెలుగులో రాఘవన్ పేరుతో డబ్‌ అయినా ఈ సినిమాలో సైకో క్యారెక్టర్ లో త‌న వీళ్ళనిజంతో భయపెట్టాడు. ఈ సినిమా తర్వాత నటుడుగా ఆయనకు మంచి గుర్తింపు వచ్చింది. తర్వాత తమిళ్ పొల్లవదన్, జ్ఞాన ఇరుక్కున్‌, అచ్చం యెనెవ‌దు మధమయదై వడ, చెన్నై బిగిల్ తో పాటు తమిళ్లో చాలా సినిమాల్లో నెగటివ్ రోల్స్ లో నటించి ఆకట్టుకున్నాడు.

என்னது..! இந்த பிரபல வில்லன் நடிகர் முரளியோட தம்பியா? இது தெரியாம போச்சே! செம சர்பிரைசில் ரசிகர்கள்! - Tamil Spark

చివరిగా గత ఏడాది ఆరియ‌వాన్ అనే తమిళ సినిమాలో కనిపించిన డెనియల్. ఈ సినిమాలో ఓ కీరోల్లో నటించాడు. అలాగే తమిళ్ నుంచి తెలుగు డబ్ అయిన పలు సినిమాల్లోను నటించాడు. తెలుగులోను కొన్ని సినిమాల్లో నటించాడు. ఎన్టీఆర్ సాంబ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన డెనియల్.. తర్వాత వెంకటేష్ ఘర్షణ మూవీలో హీరో ఫ్రెండ్ గ్యాంగ్ లో ఒకరిగా, రామ్ చరణ్ చిరుత, నాగచైతన్య సాహసం శ్వాసగా సాగిపో సినిమాల్లో కూడా డిఫరెంట్ రోల్స్ తో మెప్పించాడు.

Daniel Balaji turns director | Kannada Movie News - Times of India

నాని హీరోగా 2021 లో రిలీజ్ అయిన టచ్ జగదీష్ లో మెయిన్ విలన్‌గా డెనియల్ ఆకట్టుకున్నాడు. తర్వాత తెలుగులో ఎటువంటి సినిమాలోని నటించలేదు. డెనియల్ చేసింది అతి తక్కువ సినిమాలైనా విలక్షణ నటుడిగా సౌత్ ఇండస్ట్రీలో ప్రత్యేకమైన ఇమేజ్ను క్రియేట్ చేసుకున్నాడు. కోలీవుడ్ లో స్టార్ విలన్స్ డాడీ కూల్, భగవాన్ మోహన్‌లాల్, మమ్ముట్టిలకు దీటుగా విల‌నిజంతో మెప్పించాడు. ఇక డేనియల్ బాలాజీ తండ్రి తెలుగు మూలాలన్న వ్యక్తి కావడం విశేషం. అతడి తండ్రి తెలుగువాడు కాక తల్లి తమిళ్ అమ్మాయి.