టాలీవుడ్ స్టార్ హీరో రామ్ చరణ్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఇక తాజాగా చరణ్ పుట్టినరోజు వేడుకలు గ్రాండ్ లెవెల్‌లో జరిగాయి. రామ్ చరణ్ అభిమానులు ఈ పుట్టిన రోజు సెలబ్రేషన్స్‌ను ఓ పండుగలా జరుపుకున్నారు. అయితే ఈ క్రమంలో రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా ఉపాసన అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చి చరణ్‌ను సర్‌ప్రైజ్ చేసిందంటూ ఓ న్చూస్ నెట్టింట హాట్ టాపిక్‌గా మారింది. చెర్రీకి గుర్రాలు అంటే చాలా ఇష్టం.
తన నాలుగో తరగతి నుంచి హార్స్ రైడింగ్ నేర్చుకున్నారని టాక్. ఈ క్రమంలో చరణ్‌కు ఉపాసన తనకు ఇష్టమైన ఓ గుర్రాన్ని బహుమతిగా ఇచ్చారని.. ఉపాసన ఇచ్చిన బహుమతి చూసి చరణ్ చాలా హ్యాపీగా షీల్ అయ్యారని సమాచారం. చెర్రీ పై ఉన్న ప్రేమను ఉపాసన ఇలా తనకు ఎంతో ఇష్టమైన గిఫ్ట్‌తో సర్‌ప్రైజ్ చేసి చాటుకున్నారు. అయితే ఈ విషయాం పై అఫిషియల్ అనైన్స్‌మెంట్ ఇంకా బయటకు రాలేదు.
ఇక చరణ్ పుట్టినరోజున గేమ్ ఛేంజర్ సినిమా నుంచి జరగండి జరగండి సాంగ్ రిలీజై మంచి హైప్ తెచ్చుకుంటుంది. ఇక ఈ మూవీలో ప్రేక్షకులను అకట్టుకునే అన్ని అంశాలు ఉండనున్నాయట. గేమ్ ఛేంజర్ కచ్చితంగా భారీ సక్సస్‌తో రికార్డులు తిరగరాస్తుందని ఫ్యాన్స్ తమ అభిప్రాయాని వ్యక్తం చేస్తున్నారు. ఇక ఉపాసన చెర్రీ కి మనస్సులో ఎంతో ఇష్టంగా ఫీల్ అయ్యే దాని తెలుసుకొన్ని మరీ గిఫ్ట్ చేయడంతో ఫ్యాన్స్ ఆమెకు ఫిదా అవుతున్నారు.