‘ గుంటూరు కారం ‘ సినిమాను మిస్ చేసుకున్న ఆ స్టార్ హీరో ఎవరో తెలిస్తే షాక్ అవుతారు

టాలీవుడ్ స్టార్ హీరో మహేష్ బాబు, మాటల మంత్రికుడు త్రివిక్రమ్ కాంబోలో తెర‌కెక్కిన మూవీ గుంటూరు కారం. ఈ సినిమా సంక్రాంతి బరిలో త్వరలోనే ప్రేక్షకుల ముందుకి రానుంది. మాస్ యాక్షన్‌తో తెర‌కెక్కుతున్న ఏ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే మహేష్ నుంచి సినిమా రిలీజై ఏడాదిన్న‌ర‌ కావడంతో పాటు.. యంగ్ అండ్ ఎనర్జిటిక్ స్టార్ బ్యూటీ శ్రీలీల, మీనాక్షి చౌదరి ఈ సినిమాలో హీరోయిన్లుగా నటించడంతో సినిమాపై ప్రేక్షకులు మంచి అంచనాలను నెలకొన్నాయి. ఇక తాజాగా ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన సాంగ్స్ అన్ని ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి.

దీంతో ఈ సినిమా నుంచి వచ్చే టీజర్, ట్రైలర్ పై ప్రేక్షకుల్లో మరిన్ని అంచనాలనెల‌కొన్నాయి. ఇక తాజాగా రిలీజైన కుర్చీ సాంగ్ తో సినిమాపై ఏ రేంజ్ లో హైప్‌ పెరిగిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తాజాగా మహేష్ మీనాక్షి చౌదరి కలిసి ఉన్న ఓ పోస్టర్ రిలీజ్ అయి నిమిషాల్లోనే వైరల్ గా మారింది. ఇక ఇటీవల సెన్సార్ పూర్తి చేసుకున్న ఈ సినిమాకు యూ\ఎ సర్టిఫికెట్ వచ్చింది. 2 గంటల 45 నిమిషాలు నడివి ఉన్నట్లు సమాచారం. ఈ సినిమాకు పోటీగా సైంధవ్, హనుమాన్, నా సామి రంగ సినిమాలు రంగంలోకి దిగనున్నాయి, మొదట ఈగిల్ సినిమా కూడా సంక్రాంతి బరిలోనే వస్తుంది అనుకున్నారు.

కానీ ఈ సినిమా మేకర్స్ పోస్ట్ పని చేయడంతో మిగిలిన సినిమాలు మహేష్ గుంటూరు కారంతో తలపడేందుకు సిద్ధంగా ఉన్నాయి. ఇక ఈ సినిమాలో జగపతిబాబు, రమ్యకృష్ణ, ప్రకాష్ రాజు కీలక పాత్రలో నటించారు. అయితే ప్రస్తుతం మహేష్ బాబు నటించిన గుంటూరు కారం మొదట ఎన్టీఆర్ కోసం రాసాడ‌ట త్రివిక్రమ్. కాగా0 ఈ స్టోరీ ఏవో కారణాలతో ఈ సినిమా ఆగిపోయింది. దీంతో మహేష్ కు స్టోరీ నచ్చడంతో మహేష్ ని పెట్టి ఈ సినిమాను తెరకెక్కించాడు త్రివిక్రమ్. అయితే మహేష్ కు తగ్గట్టుగా కథలో కొన్ని మార్పులు చేసినట్లు తెలుస్తుంది. ప్రస్తుతం ఈ న్యూస్‌ సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో అంతా ఆశ్చర్యపోతున్నారు.