ఎన్టీఆర్‌ను కుంటి గుర్రం అని కామెంట్ చేసిన రాజమౌళి.. అంత నీచమైన కామెంట్ చేయడానికి కారణం ఏంటంటే..?

రాజమౌళి ఎన్టీఆర్‌కు ఉన్న బాండింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వీరిద్దరూ సినీ కెరీర్ ఒకేసారి ప్రారంభమైంది. స్టూడెంట్ నెంబర్ 1తో మూవీ డైరెక్టర్ గా మారాడు రాజమౌళి. ఆ సినిమా ఎన్టీఆర్ కెరీర్ లోనే సెకండ్ సినిమా. ఇక‌ వీరిద్దరికి దాదాపు ఒకేసారి మొదలైంది అని చెప్పవచ్చు. ఇక రాజమౌళి ఎన్టీఆర్ కాంబోలో ఏకంగా నాలుగు సినిమాలు వచ్చాయి. ఎన్టీఆర్ ఇన్ని సినిమాలు మ‌రే డైరెక్టర్ తోనూ చేయలేదు. వీరిద్దరు కాంబోలో వచ్చిన సింహాద్రి ఇండస్ట్రియల్ హిట్. యమదొంగ సూపర్ హిట్. ఆర్‌ఆర్ఆర్ మూవీ పాన్ ఇండియా లెవెల్ లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్.

ఎన్టీఆర్‌కి గ్లోబల్ ఇమేజ్ ని కూడా తెచ్చిపెట్టింది. అయితే ఎప్పటికప్పుడు ఎన్టీఆర్ ఒక గొప్ప నటుడు అంటూ పొగిడే రాజమౌళి ఓ ఇంటర్వ్యూలో కుంటి గుర్రంతో పోల్చి చెప్పాడు. ఆ మేటర్ ఏంటి.. అసలు ఎందుకు అలా అనాల్సి వచ్చిందో ఒకసారి చూద్దాం. గతంలో ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న జ‌క్క‌న త‌న మొద‌టి సినిమాకి హీరోగా ప్రభాస్‌ను అనుకున్నా.. కానీ అతను ఆ సినిమాలో చేయడం కుదరలేదు. దీంతో జూనియర్ ఎన్టీఆర్ పేరు తెరపైకి వచ్చింది.

ఫస్ట్ రోజు సెట్స్ లో ఎన్టీఆర్ ని చూసి నేను చాలా డిసప్పాయింట్ అయ్యా. సరిగ్గా మూతి మీద మీసం లేదు, పొట్టిగా, బొద్దుగా ఉన్నాడు నా ఫస్ట్ మూవీ హీరో ఇతన అని భావించ. అయితే నేను ఛాలెంజస్ అంగీకరిస్తాను. కుంటి గుర్రంతో సవారి చేస్తే ఆ మజానే వేరు అనుకున్నాను. అయితే ఒకసారి సినిమా షూటింగ్ మొదలైన తర్వాత ఎన్టీఆర్ పట్ల ఒపీనియన్ అంతా మారిపోయింది. అతడి ఎనర్జీ, యాక్టింగ్‌ స్కిల్స్ నన్ను ఆశ్చర్యపరిచాయి. అప్పుడు మరింత ఉత్సాహంగా పనిచేసే అంటూ వివరించాడు.