ఓటిటిలో ఫ్యామిలీ కిల్లర్ జాలి స్టోరీ మానియా.. ఏకంగా 30 దేశాల్లో ట్రెండింగ్..

కేరళ కి చెందిన జాలి జోసఫ్ గురించి ఈ మధ్య దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. తన ఫ్యామిలీకి చెందిన వారిని, తన సొంత వారిని.. తన విలాసాల కోసం ఆస్తి కోసం రెండో పెళ్లి కోసం వరుసగా ఒకటి కాదు, రెండు కాదు ఏకంగా ఆరుగురిని చంపేసి చాలా ఏళ్ల వరకు ఆమె ఇవన్నీ చేసినట్లు తెలియకుండా మేనేజ్ చేయగలిగింది. 2002 నుంచి మొదలుకొని 2016 వరకు ఈ మరణకాండ కొనసాగుతూనే ఉంది.

కుటుంబ సభ్యులకు కాస్తయినా అనుమానం రాకుండా సైనైడ్‌ కలిపిన ఫుడ్ పెట్టి వారందరినీ హత్య చేసింది జాలి జోసెఫ్. ప్రస్తుతం ఆ క‌థ‌ ఆధారంగా నెట్ ఫ్లిక్స్ లో ఒక డాక్యుమెంటరీని ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారు మేకర్స్. అదే కర్రీ విత్ సైనాయిడ్.. ఈ డాక్యుమెంటరీకి ఆడియన్స్ నుంచి మంచి స్పందన వచ్చింది. సాధారణంగా డాక్యుమెంటరీల‌కి పెద్దగా స్పందన ఉండదు. కానీ జాలి జోసఫ్ గురించి తెలుసుకోవడం కోసం ఆమె హత్యల విషయాలు తెలుసుకోవడం కోసం ప్రపంచమంతా ఎంతో ఇంట్రెస్ట్ చూపించారు.

మొత్తం 30 దేశాల్లో నెట్‌ఫ్లిక్స్‌ ప్రేక్షకులు డాక్యుమెంటరీని భారీ ఎత్తున వీక్షించారు. 30 దేశాల్లో ఈ డాక్యుమెంటరీ ఇప్ప‌టికీ ట్రేండింగ్ అవుతున్నట్లు తెలుస్తుంది. చాలామంది కూడా వారి వారి భాషల్లో జాలి యొక్క మరణకాండ గురించి తెలుసుకునేందుకు నెట్‌ఫ్లిక్స్‌ లాగిన్ అవుతున్నారు. తమ కుటుంబాన్ని నాశనం చేసి హ‌త్య‌లు చేసిన జాలి విషయం అసలు ఎలా బయటపడింది.. అనేది ఈ డాక్యుమెంటరీ లో చూపించారు.