మహేష్ ‘ గుంటూరు కారం ‘ శాటిలైట్ హక్కులను సొంతం చేసుకున్న ఆ ప్రముఖ సంస్థ..

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు, త్రివిక్రమ్ కాంబోలో గుంటూరు కారం సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే. సంక్రాంతి బరిలో పోటీ పడబోతున్న ఈ సినిమా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక ఇప్పటికే మహేష్ నుంచి వెండితెరపై సినిమా వచ్చి ఏడాదిన్నర కావడంతో.. ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి ఆసక్తి నెలకొంది. ఎప్పుడెప్పుడు ఈ సినిమా రిలీజ్ అవుతుంద.. ఎప్పుడెప్పుడు థియేటర్స్‌కు వెళ్లి చూద్దామా అని ఫ్యాన్స్ అంతా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

ఇక ఇప్పటికే త్రివిక్రమ్, మహేష్ కాంబోలో సినిమా వచ్చి 13 సంవత్సరాలు కావడంతో ఈ సినిమాపై మరింత హైప్‌ నెలకొంది. త్రివిక్రమ్ ఇప్పటివరకు చూడని మహేష్ కొత్త మాడ్యూల్ ఈ సినిమాలో చూపించబోతున్నాడట‌. ఊర మాస్ గెటప్ లో మహేష్ పోస్టర్‌లు ఇప్పటికే రిలీజ్ అయి మంచి రెస్పాన్స్ అందుకున్నాయి. ఇక తాజాగా ఈ సినిమా శాటిలైట్ హక్కులను ప్రముఖ టీవీ సంస్థ ఒకటి సొంతం చేసుకుందంటూ వార్తలు వినిపిస్తున్నాయి.

గుంటూరు కారం సినిమా శాటిలైట్ హక్కులకు సంబంధించిన బిజినెస్ భారీగానే జరిగిందని.. ఈ సినిమా రైట్స్ మొత్తాన్ని మా టీవీ భారీ ధరకు కొనుగోలు చేసిందని సమాచారం. ఇక ఈ సినిమా సంక్రాంతి బ‌రిలో గ‌ట్టి పోటీతో రిలీజ్ అవుతున్న ఈ మూవీ ఏ రేంజ్‌లో సక్సెస్ అందుకుంటుందో వేచి చూడాలి.