ఉదయం పూట ఖాళీ కడుపుతో చేయాల్సిన ఏకైక పని ఇదే..!

తరచుగా చాలామంది నిద్రలేచిన అనంతరం అనేక పనులు చేస్తూ ఉంటారు. కానీ నిద్రలేచిన వెంటనే వాకింగ్ చేయాలి అనే విషయం కొందరికి మాత్రమే తెలుసు. కొందరు నిద్రలేచిన తరువాత ఆహారం తీసుకోవడం లేదా ఫోన్ చూడడం లాంటివి చేస్తూ ఉంటారు.

కానీ అది చాలా ప్రమాదకరం. నిపుణుల అభిప్రాయం ప్రకారం వాకింగ్ ఎల్లప్పుడు ఖాళీ కడుపుతోనే చేయాలి. అంటే అల్పాహారానికి 30 నిమిషాల ముందు వాకింగ్ చేయడం వల్ల ఆరోగ్యానికి మేలు చేస్తుంది. కాళీ కడుపుతో నడవడం వల్ల జీర్ణక్రియ పెరుగుతుంది. అలాగే ఖాళీ కడుపుతో వాకింగ్ చేయడం ద్వారా బరువు సైతం తగ్గుతారు.

నడక సమయంలో కొవ్వు సులభంగా తగ్గుతుంది. అలాగే జీర్ణ వ్యవస్థ బలంగా మారుతుంది. ఇక ఉదయం పూట ఖాళీ కడుపుతో నడవడం వల్ల షుగర్ కంట్రోల్ అవుతుంది కూడా. మార్నింగ్ వాక్ చేయడం వల్ల చర్మం మెరిసిపోయి ముడతలు తగ్గుతాయి. మార్నింగ్ లేవగానే వాకింగ్ చేయడం వల్ల ఇన్ని ప్రయోజనాలు కలుగుతాయి. కాబట్టి ప్రతి రోజు కూడా వాకింగ్ చేయడం చాలా ముఖ్యం.