మాటల మాంత్రికుడు పై పూనమ్‌ కౌర్ సంచలన వ్యాఖ్యలు.. అలాంటి పనులు చేసి తప్పించుకుంటాడు అంటూ..

టాలీవుడ్ ఇండస్ట్రీలో మాటలు మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్‌కు ఏ రేంజ్ లో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈయ‌న‌ను ఫ్యాన్స్ గురూజీ అంటూ ముద్దుగా పిలుచుకుంటారు. ఇక ఎప్పటికప్పుడు త్రివిక్రమ్ ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా అదే రేంజ్‌లో పెరుగుతుంది. మరి కొన్ని రోజుల్లో గుంటూరు కారం సినిమాతో త్రివిక్రమ్ ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. తాజాగా ఈ సినిమా కార్యక్రమాల్లో పూర్తి చేసుకుంది.

అయితే త్రివిక్రమ్ పై గతంలో పలు సందర్భాల్లో ఫైర్ అయిన పూనామ్ కౌర్‌ తాజాగా మరోసారి అతనిపై షాకింగ్ కామెంట్లు చేసింది. ఈమె చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతున్నాయి. గుంటూరు కారం మూవీ స్టోరీ లైన్ ప్రముఖ రచయిత్రి యద్దనపూడి సులోచనారాణి కీర్తి కిరీటాల నుంచి తీసుకున్నారంటూ ప్రముఖ వెబ్సైట్ పోస్ట్ పెట్టగా.. ఆ పోస్ట్ గురించి పూనామ్ కౌర్ ఇలా రియాక్ట్ అయింది. త్రివిక్రమ్ ఏదైనా చేయగలడని.. దాని నుంచి బయటపడగలడు అంటూ కామెంట్లు చేసింది.

త్రివిక్రమ్ చేసే తప్పు పనులకు ప్రత్యేకంగా ముసుగు వేస్తారని.. ఆయన చేసే తప్పుడు పనులను ఎవరు చూడలేదని.. పూనమ్‌ వెల్లడించింది. పాత‌ ప్రభుత్వాల సీఎం కార్యాలయాలతో ఆయనకు ప్రత్యేక బంధం ఉందని వివ‌రించింది. గురూజీ అంటూ సంబోధించిన పోనామ్‌ చేసిన కామెంట్స్ ప్రస్తుతం వైరల్ గా మారాయి. ఇక గుంటూరు కారం స్టోరీ కాపీ అంటూ వస్తున్న వార్తలపై మేకర్స్ ఎలా స్పందిస్తారో వేచి చూడాలి.