కొడుకు పుట్టిన నాలుగేళ్లకు ఎంగేజ్మెంట్ చేసుకుంటున్న ఆ స్టార్ బ్యూటీ.. పిక్స్ వైరల్..

రోబో 2.o లో హీరోయిన్గా నటించిన అమీ జాక్సన్ త్వరలోనే ప్రియుడితో పెళ్లి పీటలేకబోతుంది. హాలీవుడ్ నటుడు మ్యూజిక్ డైరెక్టర్‌తో అమీ జాక్సన్ ఎంగేజ్మెంట్ తాజాగా జరిగింది. అమీ జాక్సన్ కు వెస్ట్ వీక్ ప్రపోజ్ చేసి రింగ్ తోడిగిన ఫోటోలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. స్విజర్లాండ్ లో టూర్ లో ఉన్న ఈ జంట.. సినిమా స్టైల్ లో మంచుకొండల్లో బ్రిడ్జిపై ప్రపోజ్ చేసుకున్నారు. అమీ జాక్సన్ కు వెస్ట్ వీక్ ప్రపోజ్ చేశాడు. ఈ ఎంగేజ్మెంట్ ఫోటోలను సోషల్ మీడియా ద్వారా షేర్ చేసుకుంటూ తమ రిలేషన్షిప్ ని అఫీషియల్ గా అనౌన్స్ చేశారు ఈ జంట. ఫిబ్రవరిలో ఈ జంట పెళ్లి చేసుకోబోతున్నట్లు సన్నిహిత వర్గాల నుంచి సమాచారం.

Amy Jackson shares pic from son Andreas' photoshoot, fans say 'he looks  like you'. See here | Bollywood - Hindustan Times

ఇక గతంలో అమీ జాక్సన్.. ఆండ్రెస్ పనయోట్టు అనే బిజినెస్ మాన్ తో ప్రేమలో పడింది. 2019లో ఎంగేజ్మెంట్ చేసుకున్నారు. పెళ్లి కాకుండా త‌ల్లైన అమీ జాక్సన్.. పెళ్లి పీటలు ఎక్కక ముందే వీరి బంధానికి ముగింపు తెలిపింది. 2022తో తన బంధం ముగిసినట్లు అఫీషియల్ గా ప్రకటించింది. అతనితో సన్నిహితంగా ఉన్న ఫోటోలు, జ్ఞాపకాలు తన సోషల్ మీడియా ఖాతా నుంచి డిలీట్ చేసింది. తర్వాత వెస్ట్ వీక్ తో ప్రేమలో పడింది. ఆస్కార్ విన్నర్ ఆల్ ఫోన్ సో క్యూర్ అండ్ దర్శకత్వంలో తెర‌కెక్కిన చిల్డ్రన్ ఆఫ్ మ్యాన్ సినిమాతో వెస్ట్ వీక్ యాక్టర్ గా మారాడు.

ఇక ఇప్పటికే ఎన్నో హాలీవుడ్ సినిమాల్లో నటించి మెప్పించిన వెస్ట్‌. అమెరికన్ వెబ్ సిరీస్ గాసిప్ గర్ల్ తో ఎనలేని క్రేజ్‌ సంపాదించుకున్నాడు. మరోవైపు అమీ జాక్సన్ తెలుగు, తమిళ ప్రేక్షకులకు సుపరిచితమే. ఎన్నో సినిమాల్లో నటించి ఆకట్టుకున్న ఈ ముద్దుగుమ్మ.. రజనీకాంత్, శంకర్ కాంబోలో వ‌చ్చిన రోబో 2.0తో టాలీవుడ్‌లో ఎనలేని క్రేజ్ ను సంపాదించుకుంది. ఇక పన్నీయొట్టుతో రిలేషన్షిప్ తో పాటు.. వ్యక్తిగత కారణాల వల్ల కొంతకాలం సినిమాలకు బ్రేక్ ఇచ్చింది అమీ జాక్సన్.

ఇక ఈ ఏడాది సంక్రాంతికి రిలీజ్ అయిన మిషన్ చాప్టర్ 1తో కోలీవుడ్ రీ ఎంట్రీ ఇచ్చింది. మద్రాసి పట్టణంతో తననుప‌రిచ‌యం చేసిన డైరెక్టర్ ఏఎల్ విజయ్ మూవీ తోనే మళ్లీ తిరిగి కోలీవుడ్లో అడుగుపెట్టింది. యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన మిషన్ చాప్టర్ 1 మిక్స్డ్‌ టాక్ తెచ్చుకుంది. ప్ర‌స్తుతం హిందీలో క్రాక్ మూవీ చేస్తుంది. ఈ సినిమా ఫిబ్రవరి 23న రిలీజ్ కానుంది. అయితే ఈ సినిమా హిట్ కొడితేనే అమీ జాక్సన్ కు మరిన్ని అవకాశాలు వస్తాయి. ఇక అమీ జాక్సన్ తో పాటు ఈ సినిమాలో మరో హీరోయిన్గా నోరా పతేహి నటిస్తోంది.