అభిమాని ఇచ్చిన గిఫ్ట్ చూసి ఇంద్రజ ఎమోషనల్.. తన పూజ గదిలో ఎప్పుడూ ఉంటుందంటూ కన్నీళ్లు..

ఒక్క‌ప‌టి సీనియర్ స్టార్ హీరోయిన్ ఇంద్రజకు టాలీవుడ్ లో ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఎన్నో హిట్ సినిమాల్లో నటించి కోట్లాదిమంది అభిమానాన్ని సొంతం చేసుకున్న ఈ ముద్దుగుమ్మ.. ప్రస్తుతం బుల్లితెరపై జడ్జ్ గా వ్యవహరిస్తూ ప‌లు షోల‌లో సందడి చేస్తుంది. అందులో భాగంగానే జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీలో జడ్జిగా వ్యవహరిస్తున్న ఇంద్రజ.. తనదైన జడ్జిమెంట్ తో ఆకట్టుకుంటుంది. ముఖ్యంగా తన నవ్వులతో ప్రేక్షకులను కట్టిపడేస్తుంది.

అంతేకాదు బుల్లితెర ఆడియన్స్ ని అట్రాక్ట్ చేస్తూ ఉండే ఇంద్రజ షో కి.. యాంకర్ రష్మీ తర్వాత స్పెషల్ అట్రాక్షన్ గా కనిపిస్తుంది. ఇక ఇటీవల జరిగిన ఈ షోలో ఇంద్రజ కన్నీళ్లు పెట్టుకోవడం సోషల్ మీడియాలో హైలెట్ అయ్యింది. ఇటీవల శ్రీదేవి డ్రామా కంపెనీకి సంబంధించిన కొత్త ప్రోమో రిలీజ్ అయింది. ఇందులో ఇంద్రజ ఎపిసోడ్ హైలైట్ గా నిలిచిందనే చెప్పవచ్చు. ఇక ఎప్పటిలాగే హైపర్ ఆది కామెడీతో అదరగొట్టాడు. ఈ క్రమంలో ఓ లేడీ డాన్సర్.. (ఇంద్రజ ఫ్యాన్) ఆమె కోసం గిఫ్ట్ తెచ్చింది.

తన నాన్నకి ఇంద్రజ అంటే క్రష్ అని.. చాలా కాలం నుంచి ఎంతో అభిమానం అంటూ వివరించింది. అంతే కాదు తన తండ్రి పంపించిన గిఫ్ట్ని ఇంద్రజాకి ఇచ్చింది. అభిమాని తెచ్చిన గిఫ్ట్ ని తీసుకునేందుకు స్టేజి పైకి వచ్చిన ఇంద్రజ ఆ గిఫ్ట్ ని అందరి ముందు ఓపెన్ చేసి చూడగా అందులో నృత్యకారులు ధరించే కాళ్ళ గజ్జలు ఉన్నాయి. కూచిపూడి, భరతనాట్యం లాంటి క్లాసికల్ డాన్స్లు చేసే వాళ్లకు ఉండే కాళ్ళ గజ్జలు గిఫ్ట్ గా పంపడం చూసి ఇంద్రజ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఆమె తన ఆనందాన్ని కన్నీళ్ళ రూపంలో బయటకు తీసుకువచ్చింది.

ఎంతో ప్రతిష్టాత్మకంగా.. ఆనందంగా ఈ బహుమతిని భావిస్తున్నానని ఎమోషనల్ అయింది. ఇక తన సీటు వద్దకు వెళ్ళిపోయిన ఇంద్రజ ఈ గిఫ్ట్ ఎప్పుడూ నా పూజ గదిలో ఉంటుంది అంటూ వివరించింది. మరోసారి కన్నీళ్లు పెట్టుకోవడంతో ఆ బహుమతిని ఇచ్చినా అభిమాని ఇంద్ర‌జ‌ వద్దకు వెళ్లి ఆమెను గట్టిగా హగ్ చేసుకుంది. ఇంద్రజ పలు షోల‌లో ఎమోషనల్ అవ్వడం సహజంగా జరుగుతుంటుంది. అయితే కన్నీళ్లు పెట్టుకోవడం ఎప్పుడో కానీ జరగదు. దీన్ని బట్టి ఆ గిఫ్ట్ ఆమెను ఎంతలా ప్రభావితం చేసిందో అర్థంచేసుకోవ‌చ్చు.