పవన్ ‘ ఓజీ ‘ని పక్కనపెట్టి.. నానితో మాఫియా స్టోరీ కి ప్లాన్ చేస్తున్న సుజిత్..

డైరెక్టర్ సుజిత్ ప్రస్తుతం పవన్ కళ్యాణ్ తో ఓజి సినిమాలు తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఈ మూవీ ఇప్పటికీ 70% షూటింగ్ పూర్తి చేసుకుంది. పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో బిజీగా ఉన్న నేపథ్యంలో సినిమా వాయిదా పడింది. కేవలం 15 రోజులు పవన్‌ డేట్స్ ఇస్తే సినిమా పూర్తి అయిపోతుంది. దీంతో రిలీజ్ డేట్ ని కూడా ఆగస్టులో ఫిక్స్ చేయాలని భావిస్తున్నారు. ఏప్రిల్ లో ఏపీలో ఎన్నికలు పూర్తవుతాయి. వెంటనే షూటింగ్ పూర్తి చేసి ఆగస్టులోపు రిలీజ్ చేసేయాలని టీం భావిస్తున్నారట. ఇదిలా ఉంటే సుజిత్ కు సంబంధించిన మరో లేటెస్ట్ అప్డేట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

Pawan Kalyan- Sujeeth Movie Story: పవన్ కళ్యాణ్ – సుజిత్ #OG మూవీ స్టోరీ ఇదే అయితే ఇండియా లో ఒక్క రికార్డు కూడా మిగలదు

ప్రస్తుతం పవన్ కళ్యాణ్ కు ఓజికి డేట్స్ ఇవ్వడం కుదరదు. కాబట్టి ఈ సమయంలో దర్శకుడు సుజిత్ మరో సినిమాను తెరకెక్కించే ప్లాన్ చేస్తున్నారట. నానితో సినిమా చేయాలని భావిస్తున్నారట. మాఫియా నేపథ్యంలోనే నానితో సినిమా తెర‌కెక్కించాలనుకున్నట్లు టాక్. ఈ ప్రాజెక్ట్ ఆల్మోస్ట్ కన్ఫామ్ అయ్యిందట. దీనికి కూడా డివివి దానయ్య ప్రొడ్యూసర్ అని టాక్. ఓజీకి కూడా ఆయన ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. అయితే నాని మూవీ ఓజి తర్వాతనే సెట్స్‌ పైకి వస్తుందని సమాచారం.

Nani's 'Saripodha Sanivaram' - A massy thrilling tale by Vivek Athreya!

కారణం నానికి ఇప్పటికే మూడు సినిమాలు లైన్ అప్ లో ఉన్నాయి. ప్రస్తుతం వివేక్ ఆత్రేయతో సరిపోదా శనివారం సినిమాలో నటిస్తున్నాడు. ఆ తర్వాత బలగం వేణుతో సినిమా చేయబోతున్నాడు. మరోవైపు దసరా ఫేమ్ శ్రీకాంత్ ఒద్దెలతో ఓ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. అలాగే త్రివిక్రమ్ కూడా ఓ సినిమాకు ప్లాన్ చేస్తున్నాడట. ఈ నేపథ్యంలో సుజిత్ మూవీ ఎప్పుడు ఉంటుందనేది పెద్ద ప్రశ్నగా మారింది. నాని బిజీ లైనప్ ప్రకారం దీనికి ఇంకా చాలా టైం ఉంది.