దెయ్యంలా ఉన్నావన్న పట్టించుకోను.. నా ప్రొఫెషన్ నాకు ముఖ్యం.. శృతిహాసన్

టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్‌గా క్రేజ్‌ సంపాదించుకున్న హీరోయిన్లలో శృతిహాసన్ ఒకరు. గ‌త‌ఏడాది వరస సక్సెస్లు అందుకుంటూ టాలీవుడ్ లక్కీ బ్యూటీగా మారిపోయిన ఈ ముద్దుగుమ్మ.. తాజాగా కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలను షేర్ చేసుకుంది. తనకి నలుపు రంగు అంటే చాలా ఇష్టమని.. సోషల్ మీడియా వేదికపై ఎక్కువగా బ్లాక్ కాస్ట్యూమ్ లో కనిపించడంతో చాలామంది ట్రోల్స్ చేస్తూ ఉంటారని చెప్పుకొచ్చింది శృతి.

Shruti haasan - 92 | Bollywood actress, Actresses, Beauty

ఒక మహిళ ఆర్టిస్ట్ పొగడ్తలే కాదు.. అప్పుడప్పుడు విమర్శలు ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలి. ఇతరుల ఒపీనియన్కు భయపడటం, బాధపడడం లాంటి పనులు నేను అసలు చేయను అంటూ వివ‌రించిన ఆమె నాకు ఫస్ట్ నుంచి బ్లాక్ కలర్, మెటాలిక్ జ్యూవెలరీ వేసుకోవడం చాలా ఇష్టం.. మెటల్స్ ని కేవలం సంగీతంపై ఇష్టం ఉన్నవారు మాత్రమే వేసుకుంటారు. అవి నాలో బలాన్ని రెట్టింపు చేస్తాయి అంటి చెప్పింది.

5 Instagram Posts Of Shruti Haasan That Prove “Black Is Love”

ఆభరణాలు నచ్చని కొందరు దయ్యంలా ఉన్నావ్ అంటూ కామెంట్లు చేశారు. అలాంటి కామెంట్స్ ని పెద్దగా పట్టించుకోను. నాకు నా ప్రొఫెషన్, నా ఇష్టం ముఖ్యం అంటూ సమాధానం చెప్పింది శృతిహాసన్. తను నాచురల్ బ్యూటీ కాదంటూ వచ్చిన విమర్శలపై స్పందిస్తూ ఈ విషయం నేను ఒప్పుకుంటా.. కానీ అద్దంలో నన్ను నేను చూసుకున్నప్పుడు నాకు బాగా నచ్చుతాను అంటూ వివరించింది.