కొరటాల శివకు షాక్ ఇచ్చిన సుప్రీం కోర్ట్.. 8 ఏళ్ల క్రితం చేసిన తప్పు ఇప్పుడు వెంటాడుతుందా..?

సూపర్ స్టార్ మహేష్ బాబు – కొరటాల శివ కాంబినేషన్లో తెర‌కెక్కిన శ్రీమంతుడు సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఎలాంటి బ్లాక్ బ‌స్టర్ సొంతం చేసుకుందో అందరికీ తెలుసు. ఊరిని దత్తత తీసుకున్ని అన్ని సౌక‌ర్య‌లు క‌ల్పించిన వ్య‌క్తిగా ఈ సినిమాలో మహేష్ బాబు ఎంతో అద్భుతంగా నటించి మెప్పించాడు. అయితే ఈ సినిమా కాపీరైట్స్ వివాదం గత కొంతకాలంగా జరుగుతూనే ఉంది. శరత్ చంద్ర అనే రైటర్ ఈ సినిమా కథ నాదేనంటూ అప్పట్లో చేసిన హంగామా నెట్టింట తెగ‌సందడి చేసింది.

Srimanthudu Movie Story Controversy,Koratala Siva: 'శ్రీమంతుడు' కేసులో  కొరటాలకి సుప్రీంలో చుక్కెదురు.. క్రిమినల్ చర్యలు తప్పవు - srimanthudu story  controversy criminal case against ...

ఈ కేసు చివరకు సుప్రీంకోర్ట్‌కు చేరింది. దీంతో హైకోర్టు ఆదేశాలు ప్రకారం కొరటాల శివ క్రిమినల్ కేసును ఫేస్ చేయాల్సిందేనని కోర్టు ఆదేశించింది. నిరంజన్ రెడ్డి ఈ కేసును వాదించాడు. అయితే కొరటాల శివకు అనుకూలంగా తీర్పు రాలేదు. ఇక కోర్ట్‌ తీర్పు పై కొర‌ట్టాల శివ ఎలా స్పందిస్తారో వేచి చూడాలి. కాగా ఎనిమిదేళ్ల క్రితం చేసిన ఈ తప్పు కొరటాలను ఇప్పుడు వెంటాడుతుంది అంటూ కామెంట్లు వినపడుతున్నాయి. అయితే ప్రస్తుతం కొరటాల శివ.. ఎన్టీఆర్ దేవర షూటింగ్ పనుల్లో బిజీగా గడుపుతున్నాడు.

ఈ సినిమా షూటింగ్ దాదాపు పూర్తి కాగా.. కొరటాల శివ తర్వాత ప్రాజెక్టు గురించి ఇంకా స్పష్టత రాలేదు. ఇక దేవ‌ర స‌క్స‌స్‌తో కొత్త ఆఫర్లు వచ్చే అవకాశం ఉంది. ఇలాంటి నేపథ్యంలో కొరటాల శివ నెక్స్ట్ లెవెల్ ప్రాజెక్ట్లను ఎంచుకుంటూ ముందుకు వెళుతున్నాడు. దేవర రిజల్ట్ ఎలా ఉండబోతుందో వేచి చూడాలి. ఈ సినిమాకు రూ.25 కోట్ల రేంజ్ లో రెమ్యూనరేషన్ కొరటాలు తీసుకుంటున్నట్లు సమాచారం. ఇక కొర‌ట్టాల శివ ఇతర భాషల్లో కూడా సక్సెస్ అందుకోవాలని మరిన్ని ప్రాజెక్టులతో తన సత్తా చాటాలని అభిమానులు కోరుకుంటున్నారు.