ప్రభాస్ పక్కన ఆ హీరోయినా..? మాకు వద్దు సార్.. సినిమా ఆపేయండి..ఫ్యాన్స్ న్యూ డిమాండ్..!

టాలీవుడ్ ఇండస్ట్రీలో రెబల్ స్టార్ గా పాపులారిటీ సంపాదించుకున్న ప్రభాస్ ప్రెసెంట్ కల్కి , రాజా సాబ్ సినిమా షూట్ లో బిజీగా ఉన్నారు . సూపర్ డూపర్ హిట్ లని తన ఖాతాలో వేసుకున్నాడు . కాగా ప్రజెంట్ ప్రభాస్ కి సంబంధించిన ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది . ప్రభాస్ -హనూ రాఘవపూడి దర్శకత్వంలో ఒక సినిమాకి కమిట్ అయ్యాడు అంటూ ప్రచారం జరిగింది.

ఈ సినిమాలో హీరోయిన్గా శ్రీ లీలాను అనుకున్నాడట హనురాఘవపూడి . కథ ప్రకారం హీరో హీరోయిన్ కి హైట్ వేరియేషన్ చాలా ఉండాలట. ఆ కారణంగానే హీరోయిన్ శ్రీలీలతో.. ఈ సినిమాలో కనిపించబోతున్నాడు ప్రభాస్ అంటూ ప్రచారం జరుగుతుంది . అయితే ప్రభాస్ ఫ్యాన్స్ మాత్రం దానికి ఒప్పుకోవడం లేదు. ఆ బ్యూటీ పక్కన మా ప్రభాస్ నా వద్దు కావాలంటే సినిమా ఆపేయండి అంటూ ఘాటుగా స్పందిస్తున్నారు.

మొదటినుంచి ప్రభాస్ ఫ్యాన్స్ కి ఎందుకో శ్రీ లీల ఆయన సినిమాలో నటిస్తుంది అంటే అస్సలు నచ్చడం లేదు. గతంలో మారుతి డైరెక్షన్లో తెరకెక్కిన సినిమాలోనూ వన్ ఆఫ్ ద హీరోయిన్గా శ్రీ లీల నటించబోతుంది అంటూ ప్రచారం జరిగింది . అప్పుడు కూడా ఇదే విధంగా మండిపడ్డారు . ఇప్పుడు మళ్లీ హనురాగపూడి సినిమా కోసం అదే విధంగా ఫైర్ అవుతున్నారు..!!