యుఎస్ లో మరోసారి తన మాస్ హవాను నిరూపించుకున్న మహేష్..!

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా శ్రీ లీలా మరియు మీనాక్షి చౌదరి హీరోయిన్స్ గా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కనున్న లేటెస్ట్ యాక్షన్ మాస్ మసాలా మూవీ ” గుంటూరు కారం “. ఈ సినిమాపై మహేష్ అభిమానులతో పాటు ఆడియన్స్ లో కూడా మంచి అంచనాలు నెలకొన్నాయి.

ఇక ఈ సినిమా రిలీజ్ దగ్గరికి వస్తుండగా యూఎస్ మార్కెట్లో ఆల్రెడీ బుకింగ్స్ స్టార్ట్ చేయగా అక్కడ మహేష్ మరోసారి తన మాస్ హవాని చూపించాడు. మహేష్ కి యూఎస్ మార్కెట్లో ఎలాంటి క్రేజ్ ఉంటుందో అందరికీ తెలిసిందే. తన ఫ్లాప్ సినిమాలు కూడా మినిమమ్ 1 మిలియన్ అక్కడ కలెక్ట్ అవుతుంది.

ఇక ఇప్పుడు గుంటూరు కారం బుకింగ్స్ కూడా ఇంకా సినిమాకి చాలా సమయం ఉన్నప్పటికీ ఆల్రెడీ 2 లక్షల డాలర్స్ దిశగా బుకింగ్స్ వెళ్తున్నాయి. అలాగే ఇంకా చాలా లొకేషన్స్ లో బుకింగ్స్ ఓపెన్ కావాల్సి ఉంది. ఇక రానున్న కాలంలో యూఎస్లో ఇంకెన్ని వసూళ్లు సాధించి ఎంతటి రికార్డును సృష్టిస్తాడో చూడాలి మరి.