నన్ను కుర్చీ తాత అంటారయ్యా అంటూ భిక్షాటన చేస్తున్న కుర్చీ తాత.. మహేష్ డబ్బులు ఇవ్వలేదా తాత..?

ఇటీవల సోషల్ మీడియా బాగా అభివృద్ధి చెందిన సంగతి తెలిసిందే. టాలెంట్ ఉన్న‌ ప్రతి ఒక్కరు సోషల్ మీడియాలో సెలబ్రెటీ అయిపోతున్నారు. ఇటీవల తాజాగా తెలంగాణ ఎలక్షన్ నేపథ్యంలో కుర్చీ మడత పెట్టి అంటూ ఓ బూతు డైలాగ్ చెప్సి ఆడైలాగ్ తో ఒక్కసారిగా పాపులర్ అయిపోయాడు కాలాపాషా. ప్రస్తుతం సోషల్ మీడియాలో కుర్చీ తాతగా క్రేజ్‌ సంపాదించుకున్న కాలాపాషా.. తాజాగా స్టార్ హీరో సినిమాలలో పాటలు పాడే అవకాశాన్ని కూడా అందుకున్నాడు. ఇక ఇటీవల త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో.. మహేష్ బాబు హీరోగా తెరకెక్కుతున్న గుంటూరు కారం సినిమాలో ఏకంగా ఆ కుర్చీ మడతపెట్టి అనే సాంగ్ పాడే అవకాశాన్ని అందుకున్నాడు.

తాజాగా ఈ సాంగ్ ప్రోమో రిలీజ్ చేయగానే సోషల్ మీడియాలో కూర్చి తాత పేరు మారు మోగిపోయింది. రెండు రోజులు పాటు కనిపించకుండా పోయిన కుర్చీ తాత తర్వాత వరుస ఇంటర్వ్యూలో సందడి చేశాడు. ఈ సినిమాలో పాట పాడే అవకాశం రావడం చాలా సంతోషాన్ని కల్పించిందని.. పాట పాడినందుకు లక్ష రూపాయలు ఇచ్చారంటూ ఓ ఇంటర్వ్యూలో, రూ.5వేలు ఇచ్చారంటూ మరో ఇంటర్వ్యూలో కామెంట్లు చేయడం గమనార్హం. మొత్తానికి ఈ పాట పాడడం వల్ల తాను సంతోషంగా ఉన్నానని కుర్చి తాత వెల్లడించాడు.

అయితే ఈ పాట పాడడం వల్ల మరింత ఫేమస్ అయిన కుర్చీ తాత‌.. తాజాగా ఆర్టీసీ బస్సులో బిచ్చంఎత్తుకుంటూ కనిపించాడు. నన్ను కుర్చీ తాత అంటారండి.. నాకు ఇవ్వడానికి ఒక రూపాయి కూడా లేదా అంటూ అడగడంతో దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. దీంతో అంతా షాక్ అవుతున్నారు. అదేంటి తాత గుంటూరు కారం పాటకు నీకు రెమ్యూనరేషన్ లక్ష రూపాయలు ఇవ్వలేదా.. ఎందుకు బిక్షాట‌న చేస్తున్నావ్‌ అంటూ.. ఇది నిజంగానే భిక్షాటన సినిమా ప్రమోషన్ లో భాగమా అంటూ.. నెటిజ‌న్స్‌ కామెంట్స్ చేస్తున్నారు.