‘ గుంటూరు కారం ‘ నుంచి కొత్త పోస్ట‌ర్ రివీల్ .. ఎట్ట‌కేల‌కు మీన‌క్షిని చూపించారు అది చాలంటూ కామెంట్స్..

ఇటీవల మహేష్ బాబు హీరోగా త్రివిక్రమ్ కాంబోలో తెరకెక్కిన మూవీ గుంటూరు కారం. ఈ సినిమా సంక్రాంతి బరిలో జనవరి 12న ప్రేక్షకుల ముందుకి రానుంది. కాగా ఈ సినిమాల మీనాక్షి చౌదరి, శ్రీ లీల హీరోయిన్‌లుగా నటిస్తున్నారు. అయితే మూవీ నుండి ఇప్పటివరకు రిలీజ్ అయిన ప్రతి ఒక్క అప్డేట్ లో శ్రీలీల, మహేష్ కు సంబంధించిన హైలెట్స్ తప్ప.. మీనాక్షి చౌదరిని ఎక్కడ చూపించలేదు.

దీంతో సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చలు మొదలయ్యాయి. అసలు గుంటూరు కారం సినిమాలో మీనాక్షి చౌదరి ఉందా.. ఆమె నటించిందా లేదా అంటూ అనుమానాలు వ్యక్తమయ్యాయి. అయితే తాజాగా మేకర్స్ దీనిపై క్లారిటీ ఇచ్చేశారు. మీనాక్షి చౌదరి, మహేష్ కలిసి ఉన్న కొత్త పోస్టర్‌ను రివీల్ చేశారు. ఈ పోస్టర్ చూస్తే మీనాక్షిది డీసెంట్ క్యారెక్టర్ అని అర్థమవుతుంది.

దీనిలో ట్రెడిషనల్ లుక్ లో మెరిసిన మీనాక్షి ఎంతో నేచుర‌ల్‌గా, అందంగా కనిపించింది. ఇక ఈ పోస్టర్ రిలీజ్ అయిన కొంతసేపటికి సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది. దీంతో ఎట్టకేలకు మీనాక్షిని చూపించారు ఇది చాలు అంటూ..హ‌మయా మీన‌క్షి ఉంది అంటూ.. ఈ క్లారిటీ చాలు నారు అంటూ నెటిజ‌న్స్‌ ఫన్నీ కామెంట్ చేస్తున్నారు.