రూ.17 కోట్ల ఇంజక్షన్ కోసమే సైంధవ్ పోరాటం.. డైరెక్టర్ క్లారిటీ..

విక్టరీ వెంకటేష్ కెరీర్‌లో 75వ సినిమాగా సైంధవ్‌ సినిమా తెరకెక్కిన సంగతి తెలిసిందే. ఈ సినిమా జనవరి 13, 2024 సంక్రాంతి బరిలో ప్రేక్షకులు ముందుకు రానుంది. దక్షిణ భారత భాషలతో పాటు హిందీలోను ఈ సినిమా రిలీజ్ కానుంది. ఇప్పటికే ఈ సినిమా ప్రమోషన్స్ జోరందుకున్నాయి. ఇక సక్సెస్ఫుల్ డైరెక్టర్ శైలేష్ కొలను దర్శకత్వంలో తరికెక్కుతున్న ఈ సినిమాకు సంబంధించిన ప్రతి అప్డేట్ ను మేకర్స్ ఈవెంట్ ద్వారా తెలియజేస్తున్నారు. నిహారిక ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై వెంకటేష్ బోయినపల్లి నిర్మిస్తున్న ఈ సినిమా ట్రైలర్ ఇటీవల రిలీజై మంచి రెస్పాన్స్ అందుకుంది. కథ‌ ఏంటో ట్రైలర్ లోనే తెలిసిపోయేలా డైరెక్టర్ చూపించారు.\

అయితే ట్రైలర్ చూసినవారికి ప్రతి ఒక్కరిలోనూ ఓ సందేహం మొదలైంది. ఇదే విషయాన్ని మీడియా వాళ్ళు ప్రశ్నించగా డైరెక్టర్ దీనిపై క్లారిటీ ఇచ్చేశాడు. ట్రైలర్ చూపించినట్లుగానే రూ.17 కోట్ల ఇంజక్షన్ అనేది ఉంటుందా.. లేదా సినిమా కోసం రాసుకున్న ఫిక్షనల్ పాయింట్ అని మీడియా శైలేష్‌ ను ప్రశ్నించగా.. డైరెక్టర్ దీనికి స్పందిస్తూ.. అది నిజమేనని ఈ రూ.17 కోట్ల ఇంజక్షన్ ఐడియా నాకు ఈ విధంగా వచ్చిందంటూ కారణాన్ని చెప్పుకొచ్చాడు. నిజంగానే దేశంలో స్పైనల్ మస్కిలర్ అట్రోఫీ అనేది పెద్ద సమస్యగా మారిందని.. ఎంతోమంది పిల్లలను ఈ సమస్య బయటపడుతుందని డాక్టర్లు కూడా దీని గురించి ఇప్పుడిప్పుడే తెలుసుకుంటున్నారు అంటూ వివరించాడు.

అయితే గతంలో ఏం జరుగుతుందో తెలియకుండానే చాలామంది పిల్లలు చనిపోతున్నారు. శరీరంలో ఒక జీన్ లోపించడం వల్ల ఒక్కొక్క అవయవం దెబ్బతిని పిల్లలు చనిపోతున్నారు. చాలా చిన్న వయసులో వాళ్ళకి ఈ జీన్ రీప్లేస్మెంట్ ఇస్తే వాళ్లు త్వరగానే కోలుకునే అవకాశం ఉంది. దీనికి ఉపయోగపడే ఇంజక్షన్‌కు 2 మిలియన్ డాలర్లు అంటే ఇండియన్ కరెన్సీలో 17 కోట్లు ఉంటుంది. అలాగే అంత ఖరీదైన ఇంజక్షన్ అందరూ కొనగలరా లేదా అనే సంబంధం లేకుండా దీని రేట్ ఫిక్స్ చేసేసారు. సోషల్ మీడియాలో ఇప్పటికే మనం చాలా సార్లు చూసే ఉంటాం. రూ.17 కోట్ల ఇంజక్షన్ గురించి డబ్బులు సేకరిస్తున్నారని చాలామంది అనౌన్స్ చేస్తూ ఉంటారు.

అవన్నీ ఈ ఇంజక్షన్ గురించి. నిజంగానే దేశంలో ఈ సమస్యను బాగా ఫేస్ చేస్తున్నారు. నేను కథలో ఇదే సమస్యను తన చుట్టూ డ్రామాగా క్రియేట్ చేసి చూపించా. క‌రోనా సమయంలో ఒకతను ఈ వ్యాధి గురించి సహాయం కావాలి నా దగ్గరికి వచ్చాడు. అప్పటినుంచి ఈ సమస్య గురించి సెర్చింగ్ మొదలుపెట్టాను పిల్లల ఆరోగ్య సమస్యకు మందు లేకుండా చనిపోతున్నారంటే తల్లిదండ్రులు యాక్సెప్ట్ చేసి ముందుకు వెళ్లకపోవచ్చు.. కానీ మన దగ్గర రూ.17 కోట్లు ఉంటేనే మన పిల్లలు కాపాడుకోగలము అంటే అది చాలా కష్టతరంగా ఉంటుంది. ఈ బాధపడుతున్న ఒక తండ్రి పాత్రలో వెంకటేష్ ను చూడొచ్చు. అందరూ ఈ సినిమాకు కచ్చితంగా కనెక్ట్ అవుతారు అంటూ శైలేష్ కొలను సమాధానం చెప్పాడు. ప్రస్తుతం శైలేష్ కామెంట్స్‌ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో సినిమాపై ప్రేక్షకుల్లో మరింత ఆసక్తి నెలకొంది.’