తెలుగు లేడీ ఓరియంటెడ్ సినిమాలో నయన్‌.. ఏ బ్యానర్‌లో అంటే..?

సౌత్ స్టార్ బ్యూటీల్లో ఒకరిగా కొనసాగుతున్న నయనతారకు టాలీవుడ్ ప్రేక్షకుల్లో ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఆమెను లేడీ సూపర్ స్టార్‌గా ఆమె ఫ్యాన్స్ పిలుచుకుంటూ ఉంటారు. గత కొన్నేళ్ళుగా లేడీ ఓరియంటెడ్‌ సినిమాల్లో తిరుగులేని ముద్రను వేసుకున్న నయన్.. సౌత్ లోనే హైయెస్ట్ రెమ్యునరేషన్ తీసుకుంటెన్న‌ స్టార్ హీరోయిన్ కావడం గమనార్హం. ఈ నేపథ్యంలో ఈమె తెలుగులో ఓ లేడీ ఓరియెంటెడ్ సినిమాని చేయబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

Top 10 Best Tamil Movies Of Nayantara – FilmiBeat

టాలీవుడ్ అగ్రనిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ ఈ సినిమాను ప్రొడ్యూస్ చేయబోతున్నారట. పాన్ ఇండియా స్థాయిలో ఈ సినిమాను తెరకెక్కించనున్నట్లు సమాచారం. ఈ సినిమా కోసం నయనతార కు భారీ రమ్యనరేషన్ ఆఫర్ చేశారని తెలుస్తోంది. కథలోని కొత్తదనం, కంటెంట్ కూడా ఉండడంతో నయనతారకి కూడా ఈ ప్రాజెక్టుపై ఇంట్ర‌స్ట్ ప‌రిగింద‌ని.. ఆమె ఈ ప్రాజెక్ట్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింద‌ని తెలుస్తుంది.

Nayanthara Hits And Flops Movies List - OTTARASAN

సినిమా షూటింగ్ పనులు త్వరలోనే మొదలు పెట్టబోతున్నారంటూ వార్తలు వైరల్ అవుతున్నాయి. అయితే ప్రస్తుతం నయనతార తమిళ్‌లో వరుస సినిమా ఆఫర్లను ద‌క్కించుకుంటూ బిజీగా గడుపుతుంది. దీంతో ఈ వార్తల్లో నిజమెంత ఉందో తెలియాలంటే మేకర్స్ నుంచి అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చేవరకు వేచి చూడాలి.