రాజమౌళి మూవీలో మహేష్ రోల్ ఏంటో తెలిస్తే గూస్ బమ్స్‌ ఏ..!!

పాన్ ఇండియ‌న్ స్టార్ట్ డైరెక్టర్ రాజమౌళి, సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబోలో సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా కోసం ప్రేక్షకులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా ఏప్రిల్ నుంచి సెట్స్‌ పైకి వస్తుందని వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం మహేష్.. త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న గుంటూరు కారం సినిమా సంక్రాంతి బరిలో జనవరి 12 ప్రేక్షకులు ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో సినిమా పూర్తయిన వెంటనే మ‌హేష్‌.. రాజమౌళి సినిమాకు సంబంధించిన మేకవర్‌లో బిజీ అవ్వబోతున్నాడని టాక్ వినిపిస్తోంది.

ఇదిలా ఉంటే ఈ సినిమా మీద పాన్ వరల్డ్ లో సోషల్ మీడియా వేదికగా చర్చలు మొదలయ్యాయి. సినిమాని భారీ బడ్జెట్లో రూపొందిస్తున్నట్లుగా తెలుస్తుంది. ఇప్పటికే ఈ సినిమాను రూ.800 కోట్ల బడ్జెట్‌లో తెర‌కెక్కించబోతున్నట్లు వార్తలు వైరల్ అవుతున్నాయి. ఈ సినిమా స్టోరీ ఏంటి.. ఏ జోన‌ర్‌కు సంబంధించింది అని న్యూస్ ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది. ఇది ఒక అడ్వెంచర్స్ జాన‌ర్‌కి సంబంధించిన మూవీగా.. మరి కొన్నిసార్లు ఇది ఒక పాన్ వరల్డ్ లో జరిగే స్కామ్ కు సంబంధించిన సినిమా అని తెలుస్తుంది.

Historical drama or spy thriller? Genre of Mahesh Babu – Rajamouli's film  doing the rounds on the internet | Telugu Movie News - Times of India

ఇప్పటివరకు రాజమౌళి తీసిన సినిమాలన్నింటి కంటే ఇది చాలా విభిన్నంగా ఉండబోతుంది అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. ఇక ఈ భారీ బడ్జెట్ పాన్‌ ఇండియా మూవీలో ఎవరు తెర‌కెక్కించని విధంగా రాజమౌళి సినిమాలో రూపొందించబోతున్నాడట. ఈ సినిమాలో మహేష్ బాబు ఒక స్పై పాత్రలో కనిపించబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. దీంట్లో ఎంతవరకు నిజం ఉందో తెలియాలంటే సినిమా గురించి అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చేవరకు వేచి చూడాలి.