మహేష్ కు అప్పుడు కొడుకుగా.. ఇప్పుడు పోటీగా.. కామెంట్స్ పై తేజ సజ్జ ఇంటెలిజెంట్ రియాక్షన్..

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఇప్పటికే పల సినిమాలు తో చైల్డ్ ఆర్టిస్టుగా ప్రేక్షకులను ఆకట్టుకున్న‌ తేజ హనుమాన్ సినిమాతో హీరోగా ప్రేక్ష‌కుల‌ముందుకు రానున్నాడు. ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తెర‌కెక్కిన ఈ సినిమా సంక్రాంతి బడిలో జనవరి 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. మరోవైపు టాలీవుడ్ అగ్ర హీరో మహేష్ బాబు, డైరెక్టర్ త్రివిక్రమ్ కాంబోలో రూపొందుతున్న గుంటూరు కారం సినిమా కూడా అదే రోజున రిలీజ్ కాబోతుంది. ఇక గ‌తంలో డైరెక్టర్ వైవిఎస్ చౌదరి తెర‌కెక్కించిన యువరాజు సినిమాలో మహేష్ – తేజ.. తండ్రి, కొడుకులుగా నటించారు.

Teja Sajja (@tejasajja123) / X

అంతకముందు రాజకుమారుడు సినిమాలోని వీరిద్దరూ తండ్రి కొడుకులుగా సందడి చేశారు. చూడాలని ఉంది, కలిసుందాం రా, ప్రేమ సందడి, ఇంద్రా, బాలు తదితరు సినిమాల్లో చైల్డ్ ఆర్టిసిగా నటించిన తేజ ఓ బేబీలో కీలక పాత్రలో మెప్పించాడు. జాంబి రెడ్డీతో హీరోగా ఎంట్రీ ఇచ్చి సక్సెస్ అయ్యాడు. ఇక ప్రస్తుతం ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో హనుమాన్ సినిమాతో ప్రేక్షకులు ముందుకు రాడానికి సిద్ధమయ్యాడు తేజ. జనవరి 12న ఈ సినిమా రిలీజ్ చేయబోతున్నట్లు మేకర్స్ ప్రాకటించారు. అయితే అదే రోజున టాలీవుడ్ అగ్ర హీరో మహేష్ బాబు గుంటూరు కారం సినిమా రిలీజ్ కాబోతుంది.

మీనాక్షి చౌదరి, శ్రీ‌లీలా ఈ సినిమాలో హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇక ఈ రెండు సినిమాలు ఒకే రోజున రిలీజ్ కావడంతో.. ఈ నేపథ్యంలో ఒకప్పుడు మహేష్ బాబు కొడుకుగా నటించిన తేజ ఇప్పుడు ఆయనకు పోటీ ఇస్తున్నాడంటూ ఎంటర్టైన్మెంట్ పోర్ట్ ఎక్స్ లోను సోషల్ మీడియావేదిక‌పై చ‌ర్చ‌లు మొద‌ల‌య్యాయి. దీనిపై తేజ స్పందిస్తూ సూపర్ స్టార్ తో పోటీ ఏంటండీ.. ఆయనతో పోటీ కాదు.. ఆయనతో పాటు మేము వస్తున్నాం అంటూ స్పందించాడు.

Sankranti Standoff: Guntur Kaaram and Hanuman Refuse to Budge from the  announced date - iDreamPost

తేజ చేసిన కామెంట్స్ కు చాలా మంది ప్రశంసలు వర్షం కురిపిస్తున్నారు. బాగా చెప్పావంటూ మూవీ డైరెక్టర్ ప్రశాంత్ వ‌ర్మ కూడా ఆయనను ప్రశంసించారు. కొంతమంది మేము ఇద్దరు సినిమాలు చూస్తాంలే అంటూ సమాధానం ఇచ్చారు. ఇక ప్రశాంత్ వర్మ ఇటీవల ఇంటర్వ్యూలో మాట్లాడుతూ హనుమాన్ వాయిదా పడే అవకాశాలు ఉన్నాయంటూ వెబ్సైట్లో కథనాలు కూడా వచ్చాయి. అయితే జనవరి 12నే విడుదల చేస్తున్నట్లు.. తామే ముందు ప్రకటించామని ఎట్టి పరిస్థితిలో వెనక్కి తగ్గేది లేదంటూ దీనిపై క్లారిటీ ఇచ్చేశారు. తమకు ఎలాంటి ఈగో లేదని చెప్పాడు.