బూతులు తిడుతూ రెచ్చిపోయిన హాట్ యాంకర్.. న్యూ ఇయర్ రోజు వైరల్ గా సెన్సేషనల్ వీడియో..

బుల్లితెర హాట్ యాంకర్ అనసూయ భరద్వాజ్‌కు ప్రత్యేక పరిచయం అవసరం లేదు. జబర్దస్త్ యాంకర్ గా పాపులర్ అయినా అనసూయకు ఆ షోలో వేసుకున్న దుస్తులపై విపరీతమైన విమర్శలు వచ్చాయి. ఇక అనసూయ యాటిట్యూడ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ట్రోల్స్ ఎంతగా ఎదురైతే అంతగా రెచ్చిపోయి మరి ఈ హాట్ బ్యూటీ సమాధానాలు చెప్తూ ఉంటుంది. ఎన్ని ట్రోల్స్ వచ్చినా తగ్గేదేలే అన్నట్లు.. నా బట్టలు, నా ఇష్టం విమర్శించడానికి మీరు ఎవరు అంటూ ప్రశ్నిస్తుంది. ఏకంగా విజయ్ దేవరకొండను కదిపి మరి గత ఏడాదంతా అనేక వివాదాలో చిక్కుకుంది.

ఖుషి సమయంలో కూడా ది దేవరకొండ అని పెట్టడంతో.. ది అనే అంశాన్ని పట్టుకొని ఎన్నో విధాలుగా విమర్శలు చేసింది. దీంతో విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ వద్ద చాలా ట్రోల్స్ కు గురైంది. ఈ వివాదం చాలా రోజులు నడిచింది. ఒక సందర్భంలో కావాలని నేను విజ‌య్‌ దేవరకొండ మీద పోస్ట్ పెట్టాను. ఆయన దగ్గర పనిచేసే ఓ వ్యక్తి డబ్బులు ఇచ్చి నా మీద ట్రోలింగ్స్ చేయించారని తెలిసింది. విజయ్ దేవరకొండకు తెలియకుండా అయితే ఇది జరగదు.. అందుకే విజయ్ దేవరకొండకు వ్యతిరేకంగా పోస్ట్ పెట్టా అంటూ వివరించింది.

ఇక 2023లో అనసూయ ఎన్నో వివాదాలను ఫేస్ చేశారన్న సంగతి తెలిసిందే. ఇక నిన్న 2023 కు గుడ్‌బై చెప్తు కొత్త సంవత్సరంలో అడుగు పెట్టబోతున్న నేపథ్యంలో మరోసారి సెన్సేషనల్ వీడియో ద్వారా వైరల్ గా మారింది. ఈ క్రమంలో ట్రోలర్స్‌కు హెటర్స్ కు వార్నింగ్ ఇస్తూ ఆమె ఓ రీల్ చేసింది. 2023 నా మాటలు, బిహేవియర్ వలన ఎవరైనా బాధపడి ఉంటే మీకు మంచిగా అయింది. 2024 లో కూడా నేను ఇలానే ఉంటాను.. నా జోలికి వస్తే దూల తీర్చి.. ధూపం వేస్తా జాగ్రత్త అంటూ బూతులతో రెచ్చిపోయింది.

ఇక ప్రస్తుతం అనసూయ మాట్లాడిన ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో.. మళ్ళీ మొదలు పెట్టావా అనసూయ.. నీకు ఇవన్నీ అవసరమా.. కామ్‌గా నీ సినిమాలు, షోలు చేసుకుంటూ ఉండక అంటూ సోషల్ మీడియాలో కామెంట్ ల వర్షం కురిపిస్తున్నారు. ఇక వివాదాల సంగతి పక్కన పెడితే ఈ సంవత్సరం అనసూయకు యాక్టర్ గా బాగా కలిసి వచ్చింది. చాలా సినిమాల్లో నటించింది. పాన్ ఇండియన్ బ్లాక్ బాస్ట‌ర్‌ పుష్పాలో లేడీ విలన్ గా మెప్పించింది.