” టిల్లు 2 ” మూవీ నుంచి ఇంట్రెస్టింగ్ పోస్టర్ ని రిలీజ్ చేసిన మేకర్స్… టిల్లన్నా నువ్వు కేక అంతే…!

టాలీవుడ్ యంగ్ హీరో సిద్దు జొన్నలగడ్డ గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. ” డీజే టిల్లు ” అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి ఎంతటి దుమారం లేపాడో మనందరికీ తెలిసిందే. ఇక ప్రస్తుతం సిద్దు ” డీజే టిల్లు ” కి సీక్వెల్ గా ” డీజే టిల్లు 2″ తీస్తున్న సంగతి తెలిసిందే.

ఇక ఈ సినిమా ఫిబ్రవరి 9, 2024న వరల్డ్ వైడ్ గా రిలీజ్ కానుంది. ఇక న్యూ ఇయర్ సందర్భంగా మేకర్స్ ఈ మూవీకి సంబంధించిన సరికొత్త పోస్టర్ని విడుదల చేశారు. యంగ్ బ్యూటీ అనుపమ పరమేశ్వరన్ ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే. అయితే అనుపమ హీరో సిద్దు జొన్నలగడ్డ ఒడిలో కూర్చుని వెనక్కి తిరిగి చూస్తున్న స్టీల్ను పోస్టర్ గా రిలీజ్ చేశారు మేకర్స్.

బోల్డ్ లుక్ తో రొమాంటిక్గా ఉన్నటువంటి ఈ పోస్టర్ అందరిని ఆకట్టుకుంటుంది. మల్లిక్ రామ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకి రామ్ మిర్యాల సంగీతమందిస్తున్నారు. ఇక ఈ పోస్టర్ ని చూసిన ప్రేక్షకులు…” టిల్లన్న నీకు కంఫర్ట్ గానే ఉన్నట్లుందిగా. అనుపమ నీ మరీ ఇంత బోల్డ్ గా ఏ సినిమాలోనూ చూడలేదు. నువ్వు కూడా ఇలా తయారయ్యావ్ ఏంటి? ” అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇక ప్రస్తుతం ఇందుకు సంబంధించిన పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.