” దేవర ” అప్డేట్ కి టైం లాక్ చేసిన ఎన్టీఆర్ ఆర్ట్స్… ఎప్పుడంటే..!

గ్లోబల్ స్టార్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా.. యంగ్ బ్యూటీ జాన్వి కపూర్ హీరోయిన్గా.. కొరటాల శివ దర్శకత్వంలో లేటెస్ట్ యాక్షన్ మూవీ ” దేవర “. ఇక ఈ సినిమాతోనే జాన్వి కపూర్ టాలీవుడ్ ఇండస్ట్రీకి హీరోయిన్ గా పరిచయం కానుంది.

ఇక ఆర్ఆర్ఆర్ సినిమా అనంతరం ఎన్టీఆర్ నటిస్తున్న మొదటి సినిమా కావడంతో దేవర పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక ఈ భారీ ప్రాజెక్ట్ ఏప్రిల్ 5, 2024న వరల్డ్ వైడ్ గా థియేటర్లలో రిలీజ్ కానుంది. ఇక ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ అయినటువంటి ప్రతి ఒక్కటి ఫ్యాన్స్ లో భారీ అంచనాలు పెంచాయి.

ఇక అసలు మేటర్ ఏమిటంటే.. దేవర మూవీకి సంబంధించిన అప్డేట్ ఒకటి నేడు 11: 07 గంటలకు రిలీజ్ కానున్నట్లు ఎన్టీఆర్ ఆర్ట్స్ ప్రకటించింది. అదేవిధంగా ఈ సినిమాకి సంబంధించిన గ్లింప్స్ ఏ విధంగా ఉండబోతున్నాయో అంటూ వెయ్యి కళ్ళతో ఎదురుచూస్తున్నారు ఎన్టీఆర్ అభిమానులు. ఇక ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.