అక్కడ మూడోసారి అన్ స్టాపబుల్ బుకింగ్స్ తో దూసుకుపోతున్న సలార్… ప్రభాసా మజాకానా…!

రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా.. పాన్ ఇండియా డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో లేటెస్ట్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ ” సలార్ “. ఈ సినిమా విడుదలైన ఫస్ట్ డే ఫస్ట్ షోకే పాజిటివ్ టాక్ ని దక్కించుకుంది. ఇక ఈ సినిమాపై రిలీజ్ కి ముందు అభిమానులు పెట్టుకున్న అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా ప్రభాస్ తన పేరును నిలుపుకున్నాడు.

ఇక ప్రస్తుతం ఈ మూవీ వరల్డ్ వైడ్ గా బుకింగ్స్ పరంగా దూసుకుపోతుంది. ఈ మూవీ యూఎస్ ప్రారంభంలో సూపర్ హోల్డ్ ను కనబరుస్తూ సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఇప్పటివరకు అక్కడ 8 మిలియన్ డాలర్లు వసూళ్లను రాబట్టడం జరిగింది. టాలీవుడ్ నుంచి బాహుబలి, బాహుబలి 2, ఆర్ఆర్ఆర్ సినిమాలు మాత్రమే ఈ రికార్డును సాధించాయి.

ఇక ఇప్పుడు నాలుగో మూవీగా సలార్ నిలిచింది. ఇక సలార్ మూవీతో ప్రభాస్ మరోసారి భారీ వసూళ్లను రాబట్టడం జరిగింది. ఇక దీంతో నార్త్ అమెరికా లో మూడు 8 మిలియన్ డాలర్ల వసూళ్లను రాబట్టిన వన్ అండ్ ఓన్లీ హీరోగా ప్రభాస్ నిలిచాడు. ఇక ఈ సినిమాలో శృతిహాసన్ హీరోయిన్గా నటించిన సంగతి తెలిసిందే. ఇక ప్రభాస్ యూఎస్ లో మూడోసారి అన్ స్టాపబుల్ బుకింగ్స్ తో దూసుకుపోతున్నాడనే చెప్పాలి. ‌