” హనుమంతుడు వచ్చినప్పుడల్లా ఆ విధంగా అరుస్తున్నారు “.. ప్రశాంత్ వర్మ సెన్సేషనల్ కామెంట్స్..!

ప్రశాంత్ వర్మ ఈ పేరుకు ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. చేసింది ఒక సినిమానే అయినప్పటికీ ఎంతో పాపులారిటీ దక్కింది ప్రశాంత్ వర్మ కి. తేజ హీరోగా నటించిన ” హనుమాన్ ” మూవీ ఎంతటి విజయం సాధించిందో మనందరికీ తెలిసిందే. సంక్రాంతి బరిలో రిలీజ్ అయిన ఈ మూవీ గుంటూరు కారాన్ని తలదన్ని దూసుకుపోతుంది.

ఇక ఈ సినిమా వసూళ్ల పరంగా చూస్తే.. లాంగ్ రన్ లో కూడా భారీ వసూళ్లను రాబడుతుంది. అలాగే అమృత అయ్యర్ ఈ సినిమాలో కథానాయకగా నటించిన సంగతి తెలిసిందే. ఇక ఆడియన్స్ రెస్పాన్స్ గురించి ప్రశాంత్ వర్మ ఇచ్చిన స్టేట్మెంట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ” హనుమంతుడి విగ్రహాన్ని తెరపై చూసినప్పుడల్లా ప్రేక్షకులు పిచ్చెక్కిపోతున్నారు.

పవన్ కళ్యాణ్ లాంటి మాస్ హీరోని ఎలా సెలబ్రేట్ చేసుకుంటారో అలాగే హనుమంతుడిని కూడా పండగ చేసుకుంటున్నారు ” అంటూ చెప్పుకొచ్చాడు ప్రశాంత్ వర్మ. ప్రస్తుతం ప్రశాంత్ వర్మ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఇక హనుమంతుడిని, పవన్ కళ్యాణ్ ని కంపేర్ చేసినందుకు పవన్ ఫ్యాన్స్ సైతం ఖుషి గా ఫీల్ అవుతున్నారు.