నైజాంలో భారీ డీల్ కు అమ్ముడుపోయిన ” దేవర “.. ఏకంగా అన్ని కోట్లా..!

యంగ్ టైగర్ ఎన్టీఆర్ గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. తారక్ తాజాగా హీరోగా నటిస్తున్న మూవీ ” దేవర “. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీలో జాన్వి కపూర్ హీరోయిన్గా నటిస్తుంది. ఇక ఈ సినిమాపై ఎన్టీఆర్ అభిమానులతో పాటు ఆడియన్స్ లో కూడా మంచి అంచనాలు నెలకొన్నాయి.

ఇక ఈ మూవీ ఇప్పుడే ఫైనల్ స్టేజ్ కి వచ్చింది. ఇక ఈ క్రమంలోని సినిమా బిజినెస్ కి సంబంధించి డీటెయిల్స్ స్టార్ట్ అవుతుండగా ఈ సినిమాపై ఉన్న హైప్ కి తగ్గట్లుగానే గట్టి డీల్స్ వస్తున్నట్లు తెలుస్తుంది. అలానే నైజాం హక్కులకు సంబంధించిన సాలిడ్ అప్డేట్ ఒకటి వినిపిస్తుంది. దేవర నైజాం హక్కుల కోసం ప్రముఖ డిస్ట్రిబ్యూషన్ సంస్థ 40 కోట్లకి పైగానే ఇచ్చినట్లుగా తెలుస్తుంది.

ఇక ఈ మూవీ నైజాం ప్రైస్ చూసి కొందరు ఆశ్చర్యపోతున్నారు. దీనితో ఈ భారీ మొత్తానికి డీల్ లాక్ అయినట్లుగా ప్రస్తుతం సినీ వర్గాల్లో చర్చలు జరుగుతున్నాయి. దీంతో ఇది ఎన్టీఆర్ కెరీర్ లోనే హైయెస్ట్ డీల్ అని చెప్పుకుంటున్నారు. ఇక ఈ మూవీకి అనిరుద్ సంగీతం అందిస్తున్న సంగతి తెలిసిందే. అలాగే ఈ మూవీ ఏప్రిల్ 5న గ్రాండ్ గా ప్రేక్షకుల ముందుకి రానుంది.