భర్తతో కలిసి కొత్త బిజినెస్ స్టార్ట్ చేసిన బోల్డ్ బ్యూటీ సన్ని లియోన్.. ఇంతకీ ఏం బిజినెస్ అంటే..?

స్టార్ బ్యూటీ సన్నిలియోన్‌కు ప్రత్యేక పరిచయం అవసరం లేదు. గతంలో పోర్న్ స్టార్ గా ఎన్నో సినిమాల్లో నటించిన సన్నీ.. తర్వాత ప‌లు సినిమాల్లో ఆకట్టుకుంది. ఇప్పటికే ఎంతోమంది ఫ్యాన్ ఫాలోయింగ్‌ సంపాదించుకున్న సన్నిలియోన్.. ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉన్నా.. ఈమె పేరు చెప్పగానే ఫోర్న్ స్టార్ అనే ఆలోచన అందరిలోనూ మెదులుతుంది. సినిమాలలో సరైన అవకాశాలు లేకపోవడంతో ఇండస్ట్రీకి దూరమైన వ్యాంప్‌పాత్రలో మాత్రమే నటించి మెప్పించినా.. నిజ జీవితంలో మాత్రం ఎన్నో సామాజిక కార్యక్రమాలు.. గొప్ప పనులు చేస్తూ అందరి ప్రశంసలను అందుకుంటుంది.

Sunny Leone's HOT calendar pictures - Rediff.com

ఏకంగా ఓ అనాధ పిల్లను దత్తత తీసుకొని తన సొంత బిడ్డ లాగా బాధ్యతలు అన్నిటిని చూసుకుంటుంది. సినీ ఇండస్ట్రీకి దూరంగా ఉన్న సన్నిలియోన్.. ప్రస్తుతం తన భర్తతో కలిసి వ్యాపార రంగంలోకి అడుగుపెట్టబోతుంది. ఇదే విషయాన్ని సోషల్ మీడియా వేదికగా ఆమె అభిమానులతో షేర్ చేసుకుంది. తన భర్తతో కలిసి ఈమె ఓ రెస్టారెంట్ బిజినెస్‌ మొదలు పెట్టబోతుందట. ఢిల్లీలో చికాలొకా అనే పేరిట రెస్టారెంట్ ను ప్రారంభించబోతుంది సన్నీ.

Sunny Leone Shares Heartwarming Photos With Her Family, Check Out The  Diva's Adorable Moments With Her Kids And Husband - News18

తన రెస్టారెంట్‌లో వంట చేస్తూ ఉన్న ఓ వీడియోను సన్నిలియోన్ సోషల్ మీడియా వేదికగా షేర్ చేయడంతో.. ప్రస్తుతం ఇది వైరల్ గా మారింది. దీంతో ఈమె సినిమాలు రెస్టారెంట్ బిజినెస్ లోకి అడుగు పెట్టారని అందరికీ అర్థమైంది. మరి రెస్టారెంట్ బిజినెస్ లో అడుగుపెట్టిన ఈమె పూర్తిగా సినిమాలకు చెక్‌ పెడుతుందా.. లేదా అవకాశాలు వస్తే ఇండస్ట్రీలో కొనసాగుతూనే రెస్టారెంట్ బాధ్యతలు నిర్వహిస్తుందా అనే విష‌యం తెలియాల్సి ఉంది.