విడాకులపై స్పందించిన మోటివేటర్ వంశీ.. వీడియో వైరల్..!

సోషల్ మీడియా లో ప్రత్యేకంగా పరిచయం చేయక్కర్లేని పేరు మోటివేటర్ వంశీ.‌ ఈయన మోటివేషన్ స్పీచ్ కి ఎంతో మంది అభిమానులు ఉన్నారు. ఈయన యూట్యూబ్ ఛానల్ ద్వారా పలువురిని మోటివేట్ చేస్తాడు కూడా. అయితే ఈయన త్వరలో విడాకులు తీసుకోబోతున్నట్లు కొన్ని వార్తలు వినిపిస్తుంయి. అయితే వీటిని కొందరు కొట్టి పడేసిన మరికొందరు మాత్రం చాలా సీరియస్ గా తీసుకున్నారు.

జనవరి 17న తాను తన భార్యతో పరస్పర అంగీకారాలతో విడిపోతున్నట్లు అధికారికంగా ప్రకటించారు ఈ జంట. దీంతో ప్రతి ఒక్కరు షాక్ అయ్యారు. ఇక తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న వంశీ.. తన విడాకుల గురించి స్పందించారు. ఈయన మాట్లాడుతూ..” మేము హ్యాపీగానే విడిపోదాం అనుకున్నాం. అలానే విడిపోయాం. సంతోషంగా ఉన్నప్పుడు కలిసి ఉన్నాం.

హ్యాపీగా లేము అనుకున్నప్పుడు ఇంకా కలిసి ఉండటం అనవసరం అనుకున్నాం. నిజానికి నేను పబ్లిక్ కు చెప్పినప్పుడు అడ్జస్ట్ అవ్వండి, సారీ చెప్పండి, కలిసి పోండి అని చెప్పాను కానీ.. సంతోషంగా లేనప్పుడు కలిసి ఉండకూడదు. దీనివల్ల ఎదుటి వారు కూడా బాధపడతారు. వారి లైఫ్ కూడా బాగుండాలి కదా. అందుకే హ్యాపీగా విడిపోదామనుకున్నాం. విడిపోయాం కూడా ” అంటూ చెప్పుకొచ్చాడు వంశీ. ప్రస్తుతం ఈయన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో నెట్టింట వైరల్ అవుతున్నాయి.

 

 

View this post on Instagram

 

A post shared by IDream Media (@idreammedia)