వెండితెర పైకి రానున్న ప్రధాని మోడీ జీవిత చరిత్ర… టైటిల్ ఇదే..!

మన చలనచిత్ర పరిశ్రమలో ప్రస్తుతం బయోపిక్ ట్రెండ్ నడుస్తుంది. ప్రముఖ హీరోల జీవిత కథలను బయోపిక్ కింద తీస్తూన్నారు. ఈ నేపథ్యంలోనే భారత ప్రధాని నరేంద్ర మోడీ బయోపిక్ రాబోతున్నట్లు తెలుస్తుంది. ఈ సినిమాకు క్రేజీ టైటిల్ సైతం టీం సిద్ధం చేసుకున్నారట.

” విశ్వ నేత ” అనే పేరుతో నరేంద్ర మోడీ బయోపిక్ తీయనున్నట్లు తెలుస్తుంది. ప్రతిభాసాలి సీ.హెచ్. క్రాంతి కుమార్ డైరెక్షన్లో ఈ బయోపిక్ తెరకెక్కనుంది. ఈ మూవీలో అభయ్ డియాన్, నీనా గుప్తా వంటి నటీనటులు కీలక పాత్రలు వహిస్తున్నారు. ఇక ఈ సినిమాకు కీరవాణి తనయుడు కాలభైరవ సంగీతం అందిస్తున్నాడు.

ఇక ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు త్వరలోనే స్టార్ట్ చేయనున్నట్లు తెలుస్తుంది. ఇక ఈ వార్త విన్న మోడీ అభిమానులు ఫుల్ ఖుషి అవుతున్నారు. ” మన దేశానికి ఎంతో సేవ చేసిన నరేంద్ర మోడీ బయోపిక్ తీయడం చాలా ఆనందంగా ఉంది. ఆయన మన దేశానికి చేసినంత సాయం మరెవ్వరూ చేయలేదు. మన దేశానికి మరో హనుమంతుడు మోడీ ” అంటూ కామెంట్స్ చేస్తున్నారు ప్రేక్షకులు.