తెలుగులో 7 సినిమాలు.. 19 ఏళ్లకే హాలీవుడ్ బిజీ బ్యూటీ.. ఈ అమ్మాయి ఎవరో గుర్తుపట్టారా..?

ఈ పై ఫోటోలలో హాట్ గా కనిపిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న ముద్దుగుమ్మ ఎవరో గుర్తుపట్టారా. తెలుగు మూలాలు ఉన్న అమెరికాలో పుట్టి పెరిగిన ఈ అమ్మాయి టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చి చైల్డ్ ఆర్టిస్ట్ గా ఏడు సినిమాల్లో నటించింది. మహేష్, పవన్ లాంటి స్టార్ హీరోల సినిమాలలో నటించి మెప్పించిన ఈ ముద్దుగుమ్మ.. టాలీవుడ్ లో చైల్డ్ ఆర్టిస్ట్ గా మంచి గుర్తింపు తెచ్చుకుంది. ప్రస్తుతం టీనేజ్ లో ఉన్న ఈ ముద్దుగుమ్మ హాలీవుడ్ లో వరుస సినిమాల్లో నటిస్తూ బీజీబిజీగా మారిపోయింది. ఇంతకీ ఈమె ఎవరో గుర్తుపట్టారా.. ఎవరో కాదు అవంతిక వందనాపు.

అవంతిక‌ తల్లిదండ్రులది హైదరాబాద్ అయినా కాలిఫార్నియాలో సెటిల్ అయిపోయారు. ఆ తర్వాత 2005లో ఈమె జన్మించింది. పదేళ్ళ వయసులోనే తెలుగు సినిమాల్లో ఛాన్సులు రావడంతో నాని కృష్ణ గాడి వీర ప్రేమ గాథ సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ గా అవంతికకు అవ‌కాశం వ‌చ్చింది. కానీ కొన్ని కారణాల వల్ల మిస్ అయిపోయిన తర్వాత మహేష్ బ్రహ్మోత్సవం సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ గా ఎంట్రీ ఇచ్చింది. మహేష్ సినిమాలో నటించిన తర్వాత ఇంక వరుస ఆఫర్లు వచ్చాయి. మనమంతా, ప్రేమ, రారండోయ్ వేడుక చూద్దాం, బాలకృష్ణుడు, ఆక్సిజన్, అజ్ఞాతవాసి లాంటి సినిమాలలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించి మెప్పించింది.

తర్వాత పలు యాడ్స్ లో కనిపించి ఆకట్టుకున్న అవంతిక.. టాలీవుడ్‌కు బాయ్ చెప్పేసి పూర్తిగా కాలిఫోర్నియాకు షిఫ్ట్ అయిపోయింది. 2020 నుంచి హాలీవుడ్‌లోనే పలు సినిమాలు, ఆల్బమ్ సాంగ్స్ లాంటివి చేస్తూ గుర్తింపు తెచ్చుకునే ప్రయత్నంలో ఉంది. ప్రస్తుతం ఈమె వయసు 18 ఏళ్లు. కాకపోతే లేటెస్ట్ ఫోటోలు చూస్తుంటే మాత్రం ఆమె అలా కనిపించదు. చైల్డ్ ఆర్టిస్ట్ ఫోటోలతో పోల్చి చూస్తే గుర్తుపట్టలేనంతగా మారిపోయిన ఈ బ్యూటీని మొదట చూసిన వారెవరు గుర్తుపట్టలేకపోయారు. తర్వాత ఆమె ఎవరో తెలుసుకొని ఆశ్చర్యపోతున్నారు.