ఆ విషయంలో ఫుల్ డిసప్పాయింట్ అవుతున్న బాలయ్య ఫ్యాన్స్…!

ప్రస్తుతం బాలయ్య హీరోగా దర్శకుడు కొల్లి బాబీ కాంబినేషన్లో సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఇక ఇది బాలయ్య కెరీర్లో 109వ సినిమాగా ప్లాన్ చేస్తుండగా బాలయ్య గత సినిమాలు కంటే క్రేజీ హైప్ దీనిపై నెలకొంది. ఇక ఈ సినిమా కోసం ఫాన్స్ కూడా వేయి కళ్ళతో ఎదురుచూస్తున్నారు.

ఇక ఈ పండగ సందర్భంగా ఈ సినిమా నుంచి ఏదైనా అప్డేట్ వస్తుందేమోనని ఎంతో ఆత్రుతతో చూస్తున్నారు బాలయ్య అభిమానులు. బాలయ్య సహా ఇతర సీనియర్ స్టార్స్ నుంచి సినిమాలు సహా సినిమాల అప్డేట్స్ కూడా వస్తున్నట్లు కన్ఫామ్ అయ్యింది. కానీ బాలయ్య సినిమాకి సంబంధించిన ఎటువంటి ఊసు మాటా లేదు.

దీంతో ఈ పండగకి బాలయ్య నుంచి ట్రీట్ లేనట్టే అనుకోవాలి. మరి సడన్గా ఏమన్నా అప్డేట్ కానీ సినిమా లుక్ కానీ రివిల్ చేస్తారేమో చూడాలి మరి. ఇక ఈ విషయంలో అయితే బాలయ్య అభిమానులు ఫుల్ డిసప్పాయింట్ అయ్యారు. ఇది సినిమాపై ఎఫెక్ట్ కూడా అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి.