నాగ్ ” నా సామిరంగ ” మూవీలో ఆ స్టార్ హీరో రిఫరెన్స్.. కనిపెట్టేసిన ఫ్యాన్స్..‌!

టాలీవుడ్ స్టార్ హీరో అక్కినేని నాగార్జున గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. నాగార్జున హీరోగా విజయ్ బాబీ దర్శకత్వంలో తెరకెక్కిన మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ ” నా సామి రంగ “. ఈ సినిమా నిన్న వరల్డ్ వైడ్ గా థియేటర్లలో రిలీజ్ అయింది.

ఇక ఆడియన్స్ నుంచి పాజిటివ్ టాక్ సైతం సొంతం చేసుకుంది. ఇక మెగాస్టార్ చిరంజీవి రిఫరెన్స్ ఇందులో ఉందంటూ సోషల్ మీడియాలో వార్త వినిపిస్తుంది. ఈ సినిమాలో కీలక పాత్రలలో నటించిన అల్లరి నరేష్ మరియు రాజ్ తరుణ్ లు మెగాస్టార్ చిరంజీవి మంచి దొంగ చిత్రం కి వెళ్లారు.

ఇది మెగా ఫ్యాన్స్ ను బాగా ఆకట్టుకుంది. ఈ సినిమాలో అషిక రంగనాథ్, మిర్ణ మీనన్, రుక్సర్ దిల్లాన్ లు కీలక పాత్రలలో నటించారు. ఇక శ్రీనివాస చిట్లూరి నిర్మాతగా వహించిన ఈ సినిమాకి ఆస్కార్ అవార్డు విన్నర్ ఎంఎం కీరవాణి సంగీతం అందించారు. ఇక ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.