” బింబిసారా ” ఫేమ్ వసిష్ఠ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి తన 156వ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. సోషియో ఫాంటసీ నేపథ్యంలో తెరకెక్కనున్న ఈ మూవీ షూటింగ్ సర్వేగంగా జరుగుతుంది. కానీ ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ లో మెగాస్టార్ లేరు.
ఈ నెలాఖరులో చిరు షూటింగ్లో జాయిన్ అవ్వనున్నట్లు సమాచారం. ఇక ఈ క్రమంలో మెగాస్టార్ కొత్త సినిమాకు సంబంధించిన ఇంట్రెస్టింగ్ అప్డేట్ ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతుంది. సంక్రాంతి కానుకగా ఈ సినిమా ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేయబోతున్నారట.
అంతేకాదు ఈ సినిమా టైటిల్ ని కూడా ఖరారు చేయడంతో పాటు రిలీజ్ డేట్ ను కూడా లాక్ చేసినట్లు సమాచారం. ఇక త్వరలోనే దీనిపై అఫీషియల్ అనౌన్స్మెంట్ కూడా రానుంది. ఇక ప్రస్తుతం ఈ వార్త మెగా ఫ్యాన్స్ కి ఫుల్ జోష్ ని ఇస్తుంది. ఇక గత కొంతకాలంగా ఫ్లాప్ లతో ఉన్న మెగాస్టార్ చిరంజీవి ఈ సినిమా కనుక సూపర్ హిట్ కొడితే మళ్లీ చిరు ఫామ్ లోకి వస్తాడని చెప్పాలి. మరి ఏం జరుగుతుందో చూడాలి.