ఆ చరణ్ సినిమా తెరకెక్కకుండా అడ్డుకున్న చిరంజీవి.. ఎందుకో తెలుసా..?

ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది . టాలీవుడ్ ఇండస్ట్రీలో మెగా పవర్ స్టార్ గా పాపులారిటీ సంపాదించుకున్న రామ్ చరణ్ కెరియర్ లో ఆ సినిమాను తెరకెక్కనికుండా చిరంజీవి అడ్డుపడ్డాడ..? అంటే ఎస్ అన్న సమాధానమే వినిపిస్తుంది. మెగా పవర్ స్టార్ గా పాపులారిటీ సంపాదించుకున్న రామ్ చరణ్ ప్రెసెంట్ గేమ్ చేంజర్ అనే సినిమాలో నటిస్తున్నాడు .

ఈ సినిమా తర్వాత లోకేష్ కనగరాజు ఒక సినిమాకి కమిట్ అయినట్లు వార్తలు వినిపిస్తున్నాయి . అయితే రామ్ చరణ్ తన కెరీర్ లో ఆరెంజ్ సినిమా తర్వాత మెరుపు అనే సినిమాకి కమిట్ అయ్యాడు .కోలీవుడ్ డైరెక్టర్ ధరణి దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కాల్సి ఉండింది . అయితే ఈ సినిమా కథ స్క్రిప్ట్ అంతా బాగా నచ్చిన చిరంజీవి సినిమా పూజా కార్యక్రమాలు అయిన తర్వాత సినిమాను ఆపేశారు .

దానికి కారణం అనుకున్న బడ్జెట్ కంటే డబల్ బడ్జెట్ పెరిగిపోతూ ఉండడమే . పైగా ఆరెంజ్ లాంటి బిగ్ ఫ్లాప్ తర్వాత ఇంత రిస్క్ చేయడం కరెక్ట్ కాదు అంటూ చిరంజీవి ఈ మెరుపు సినిమాని తెరకెక్కనికుండా ఆపేసాడట . అప్పట్లో ఈ వార్త బాగా వైరల్ అయింది. ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ ని హీరోయిన్ గా కూడా తీసుకున్నారు..!!