రాజమౌళి – ప్రశాంత్ నీల్ మధ్య ఉన్న తేడా ఇదే.. బయటపడ్డ అసలు నిజం..!

టాలీవుడ్ ఇండస్ట్రీలో రాజమౌళి, ప్రశాంత్ నీల్ లకు ఏ రేంజ్ పాపులారిటీ ఉందో మనందరికీ తెలిసిందే. ఈ ఇద్దరు దర్శకులు కూడా నూటికి నూరు శాతం సక్సెస్ ఉన్న డైరెక్టర్లుగా గుర్తింపు సంపాదించుకున్నారు. వీరిద్దరూ స్టార్ హీరోలతో సినిమాలు చేస్తూ బ్యాక్ టు బ్యాక్ హిట్లను అందుకుంటున్నారు. అయితే ఈ ఇద్దరి డైరెక్టర్ల మధ్య చాలా తేడాలు ఉన్నాయి. అదేంటంటే.. జక్కన్న తన సినిమాలలో ప్రతి సీన్ కూడా ఎలాంటి గందరగోళం లేకుండా కన్ఫ్యూజన్ కు గురి చెయ్యకుండా తీయడానికి ప్రయత్నిస్తాడు.

ప్రశాంత్ నీల్ కథలో ఒకింత కన్ఫ్యూషన్ ఉన్నా ప్రేక్షకులకు గూస్ బంప్స్ వచ్చే సీన్స్ కు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాడు. జక్కన్న నిదానమే ప్రధానం అనే ఫార్ములాను ఫాలో అయితే ప్రశాంత్ నీల్‌ మాత్రం తన సినిమాలను వేగవంతంగా పూర్తి చేసేందుకు ప్రయత్నిస్తాడు. సలార్ మూవీ షూటింగ్ కేవలం 114 రోజుల్లో పూర్తి చేశాడు ప్రశాంత్ నీల్.

ఇక దీని బట్టి చూసుకుంటే ఈయన ఎంత స్పీడో మనం అర్థం చేసుకోవచ్చు. ఇక ప్రశాంత్ డార్క్ షేడ్ లో సినిమా తీయడానికి ప్రయత్నిస్తే.. జక్కన్న మాత్రం కలర్ఫుల్ గా ఉండేలా చూసుకుంటాడు. ఇక ఈ చిన్ని చిన్ని పాయింట్స్ జక్కన్నకు మంచి పాపులారిటీ తెచ్చాయని చెప్పాలి. ఇక ఈ ఇద్దరి దర్శకులకు ఒక ఇంత సరైన ఫాలోయింగ్ ఉన్నప్పటికీ.. జక్కన్నకు ప్రశాంత్ నీల్ మీద కొంచెం ఎక్కువే ఉంటుంది. ఇక జక్కన్న ఫార్ములాను ఉపయోగించి ప్రశాంత్ నీల్ కనుక సినిమా తీస్తే బాక్సాఫీసులు బద్దలు అవ్వాల్సిందే.