సలార్ ఫస్ట్ ఛాయిస్ ప్రభాస్ కాదా.. ఆ స్టార్ హీరోనా.. అసలు ఊహించలేరు..

ప్రశాంత్ నీల్‌ దర్శకత్వంలో తెర‌కెక్కిన తాజా మూవీ స‌లార్‌. ప్రభాస్ హీరోగా, శృతిహాసన్ హీరోయిన్గా, పృథ్వీరాజ్ సుకుమారన్‌ కీలకపాత్రలో నటించిన ఈ మూవీ ప్రస్తుతం ఎలాంటి సక్సెస్‌తో దూసుకుపోతుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తున్న ఈ సినిమాలో.. ప్రశాంత్ నీల్‌.. రెబల్ స్టార్ ను ఓ రేంజ్ లో ఎలివేట్ చేశాడు. నాలుగు రోజుల్లోనే రూ.500 కోట్ల కలెక్ట్ చేసిందంటే సినిమాను ఏ రేంజ్ లో రూపొందించాడో అర్థం చేసుకోవచ్చు. ఈ విషయాన్ని పక్కన పెడితే ప్రశాంత్.. ప్రభాస్ కు బదులు మరో స్టార్ హీరోతో ఈ సినిమా చేయాలని ప్లాన్ చేసుకున్నాడట.

అయితే ఆ హీరో తో కాకుండా ప్రభాస్ తో సినిమాను తెరకెక్కించాడు. ఇంతకీ ఎవరా హీరో.. ఎందుకు అతనిని మార్చేశారు.. ఒకసారి చూద్దాం. ఆ హీరో ఎవరో కాదు తమిళ్ స్టార్ హీరో సూర్య. సూర్య కోసం స్క్రిప్ట్ రెడీ చేసుకుంటున్న నేపథ్యంలో డైరెక్షన్ డిపార్ట్మెంట్‌లో ఒకరు ఈ కథకు ప్రభాస్ ఐతే బాగా సెట్ అవుతాడు అంటూ సజెషన్ ఇచ్చారట. అతని సజెషన్ విన్న ప్రశాంత్ రోజంతా ప్రభాస్ ను స్క్రిప్ట్ లో ఇమేజినేష‌న్ చేసుకున్నాడ‌ట.

నిజంగానే ఈ మూవీకి రెబల్ స్టార్ పర్ఫెక్ట్ గా ఉంటాడు అని భావించిన డైరెక్టర్.. వెంటనే ప్రభాస్‌కు స్టోరీ చెప్పాడు. ప్రభాస్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో మూవీ షూటింగ్ స్టార్ట్ చేశారు. ఇక ఈ సినిమా ప్రస్తుతం 1000 కోట్ల వసూళ్ల బాటలో దూసుకుపోతుంది. ఇక ఈ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో సూర్య చేయవలసిన బ్లాక్ బస్టర్ మూవీని ప్రభాస్ చేశాడా అంటూ.. ఈ సినిమాకు నిజంగానే ప్రభాస్ మాత్రమే సెట్ అవుతాడు.. సూర్య చేసి ఉంటే ఈ సినిమా అంత సక్సెస్ వచ్చేది కాదు అంటూ.. కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్స్.