ఫ్యాన్స్‌కు తీవ్ర అన్యాయం చేసిన టాలీవుడ్ స్టార్ హీరోలు వీళ్ళే.. ఇది త‌ప్పు క‌దా బాసు…!

కొంతమంది టాలీవుడ్ స్టార్ హీరోలు 2023 వ సంవత్సరాన్ని పూర్తిగా వదిలేశారు. ఈ ఏడాది ఆ స్టార్ హీరోల నుంచి ఒక్క సినిమా కూడా రిలీజ్ కాలేదు. అలాంటి స్టార్స్ లో ఎన్టీఆర్, రామ్ చరణ్, మహేష్ బాబు, అల్లు అర్జున్ తో పాటు సీనియర్ హీరోలు కూడా ఉండడం ఆశ్చర్యాన్ని కల్పిస్తుంది. ఈ ఇయర్ లో మహేష్ నుంచి కూడా సినిమా రాలేదు. నిజానికి ఈ ఏడాది ఆగస్టులోనే గుంటూరు కారం సినిమా రిలీజ్ కావాల్సింది. కానీ త్రివిక్రమ్ – మహేష్ మధ్య భేదాల కారణంగా ప్రీ ప్రొడక్షన్ పనులు ఆగిపోయాయి. దీంతో సినిమా నిర్మాణాన్ని కొంతకాలం నిలిపేశారు. ఇక ఆగస్టు నుంచి 2024 జనవరి 12కి సినిమా రిలీజ్ డేట్ వాయిదా పడింది.

Mahesh Babu is disciplined about fitness': His lifestyle coach reveals -  Hindustan Times

అలా మహేష్ బాబు నుంచి కూడా 2023వ సంవత్సరంలో ఒక్క సినిమా కూడా రాలేదు. ఆర్‌ఆర్ఆర్ మూవీ తో గ్లోబల్ వైడ్‌గా క్రేజ్‌ను సంపాదించుకున్న చెర్రీ, తారక్ ఇయర్స్ స్టార్టింగ్ లో ఆస్కార్ ప్రచారంలో పాల్గొనడంతో వాళ్ల కొత్త సినిమాల షూటింగ్‌లు కూడా నిలిచాయి. ప్రస్తుతం ఎన్టీఆర్ దేవర షూటింగ్‌లో ఉన్నాడు. 2024 ఏప్రిల్ లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. మరోవైపు శంకర్ దర్శకత్వంలో గేమ్ చేంజ‌ర్‌ సినిమాలో రామ్ చరణ్ నటిస్తున్నాడు. మరో రెండు నెలలు ఈ సినిమా షూటింగ్ జరుగుతుంది. దీని కారణంగా రామ్ చరణ్ మూవీ కూడా 24 జూన్ తర్వాతే రిలీజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి.

The secret behind Nagarjuna, Venkatesh broken hearts | cinejosh.com

ఇక అల్లు అర్జున్ విష‌యానికి వస్తే ప్రస్తుతం పుష్పా 2 సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నాడు. డైరెక్టర్ సుకుమార్ పార్ట్ 2 ని 2023లో రిలీజ్ చేయాలని భావించాడు. అయితే ఫస్ట్ పార్ట్ పాన్ ఇండియా లెవెల్ లో భారీ సక్సెస్ అందుకోవడంతో సీక్వెల్ అంతకుమించి ఉండాలని ప్లాన్ చేసిన సుకుమార్.. సినిమా అవుట్ ఫుట్ మరింత మెరుగ్గా రావడం కోసం.. 2024 ఆగస్ట్‌కి ఈ సినిమాను వాయిదా వేశాడు. ఫలితంగా ఈ ఇయర్ అల్లు అర్జున్ సినిమాలు కూడా టాలీవుడ్ ప్రేక్షకులు చూడలేకపోయారు. అలాగే సీనియర్ హీరో నాగార్జున, వెంకటేష్ యంగ్ హీరోస్ రానా, శర్వానంద్ ల దగ్గర నుంచి కూడా ఈ ఏడది ఒక మూవీ కూడా రాలేదు.

Sharwanand and Rana Daggubati film on Cards?

ఇక గతేడాది ఒకే ఒక జీవితం సినిమాతో మంచి సక్సెస్ అందుకున్న శ‌ర్వానంద్ ప్రస్తుతం తన 35వ సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నాడు. శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ఏవో కారణాలతో కొంతకాలం వాయిదా పడింది. 2023లో ఈ సినిమా రిలీజ్ కాలేదు. ఇక రానా, వెంక‌టేష్‌ నుంచి రానా నాయుడు వెబ్ సిరీస్ వచ్చినప్పటికీ వెండితెరపై ఎటువంటి సినిమా రిలీజ్ కాలేదు. అలాగే వెంకటేష్ నుంచి సైంధ‌వ్ సినిమా డిసెంబర్‌లో రిలీజ్ కావాల్సింది. ఏవో కారణాలతో వచ్చేయడాది జనవరి 13 కి వాయిదా పడింది. ఇక గ‌తేడాది గోస్ట్‌తో భారీ డిజాస్ట‌ర్‌ అందుకున్న నాగార్జున మూడు నెలల క్రితం నా సామి రంగ మూవీ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. అయితే ఇంకా సినిమా షూటింగ్ జరుగుతుంది. దీంతో ఈ ఏడాది నాగార్జున సినిమాలు కూడా రాలేదు.