ఏంటి…” సలార్ ” ఆ వెర్షన్‌ రిలీజ్ కాదా…!!

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా… శృతిహాసన్ హీరోయిన్గా.. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కనున్న లేటెస్ట్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ” సలార్ “. ఈ సినిమాపై డార్లింగ్ అభిమానులతో పాటు ఆడియన్స్ లో కూడా మంచి అంచనాలు నెలకొన్నాయి. ఇక ఈ మూవీ నుంచి కొద్దిసేపటి క్రితమే ఫస్ట్ సాంగ్ రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. రిలీజ్ అయిన ఐదు నిమిషాలకే భారీ రికార్డును నెలకొల్పింది ఈ సాంగ్.

ఇక మరికొన్ని రోజుల్లోనే ఈ సినిమా రిలీజ్ కానుండగా… ఈ మూవీ యూఎస్ లో కూడా భారీ ఎత్తున రిలీజ్ కి లాక్ అయినట్లు తెలుస్తుంది. అయితే యుఎస్ లోనే ఈ మూవీ ఐమాక్స్ వర్షన్ లో కూడా చాలా గ్రాండ్గా రిలీజ్ చేస్తున్నట్లుగా యూఎస్ డిస్ట్రిబ్యూటర్స్ తెలిపారు. కానీ ఇప్పుడు షాకింగ్ గా సలార్ ఐమాక్స్ వర్షన్ లో రిలీజ్ చేయడం లేదని మేకర్స్ అనౌన్స్మెంట్ చేశారు.

కేవలం ఎక్స్ డి మరియు పి ఎల్ ఎఫ్ ఫార్మాట్స్ మాత్రమే రిలీజ్ చేస్తున్నట్లుగా తెలిపారు. మరి ఇది మాత్రం ప్రభాస్ ఫ్యాన్స్ కి ఒక డిసప్పాయింటింగ్ న్యూస్ అనే చెప్పాలి. లాస్ట్ మినిట్ లో మరింత డిసప్పాయింట్ కాకూడదు అని తాము ముందే చెప్పినట్లుగా డిస్టిబ్యూటర్స్ తెలిపారట. ప్రస్తుతం వీరు షేర్ చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.