విజ‌య్ దేవ‌ర‌కొండ‌ను టార్గెట్ చేసినోళ్ల‌కు ఇలాంటి గ‌తే ప‌డుతుందా…!

ఎటువంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీ లోకి అడుగు పెట్టాడు యంగ్‌ హీరో విజయ్ దేవరకొండ. ఎన్నో అవమానాలు, కష్టాల తర్వాత హీరోగా సినిమా అవకాశాన్ని అందుకొని ప్రస్తుతం ఇండియాలోనే క్రేజీ స్టార్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు. హిట్లు, ప్లాపులతో సంబంధం లేకుండా క్రేజ్‌ను పెంచుకుంటూ పోతున్న ఈ రౌడీ హీరో వరుస‌ సినిమాల్లో దూసుకుపోతున్నాడు. అయితే ఏ హీరో ఆలోచించని విధంగా విజేయ్ త‌న అభిమానుల కోసం ఆలోచిస్తూ ఉంటాడు. తన సినిమాల్లో వచ్చిన లాభాలను అభిమానులతో పంచుకుంటాడు.

తన పుట్టినరోజు వేడుకలకు కూడా అభిమానులకు గిఫ్ట్‌లు ఇస్తూ వారిని సంతోష పెడతాడు. ఇలా విజయ్ తన మంచితనం చాటుతూ ఇతర హీరోల ఫ్యాన్స్‌ను కూడా ఆకట్టుకుంటున్నాడు. అయితే ఈ రేంజ్‌లో సక్సెస్ వచ్చిన తరువాత ఆ హీరోలపై ట్రోల్స్, మీమ్స్ ఖ‌చ్చితంగా ఉంటాయి. వాటిని హీరోలు కూడా పెద్దగా పట్టించుకోరు. అయితే కొన్ని ట్రోల్స్ విమర్శలు మరీ శృతిమించి హద్దులు దాటుతంతో ఆ సందర్భాల్లో హీరో రియాక్ట్ అవ్వాల్సి వస్తుంది.

తాజాగా విజయ్ దేవరకొండ విషయంలోనూ అదే జరిగింది. ఓ తెలుగు యూట్యూబర్‌ హద్దులు దాటి విజయ పై బాడ్ రూమర్లను క్రియేట్ చేశాడు. అనంతపురంకి చెందిన ఓ యూట్యూబర్ వెంకట్ కిరణ్ సినీ పోలీస్ అనే యూట్యూబ్ ఛానల్ ద్వారా విజయ్ పై బాడ్ రూమర్స్ క్రియేట్ చేయడమే కాకుండా.. తనతో నటించే హీరోయిన్స్ పై కూడా అసభ్యకర వార్తలను సృష్టించి వారిని అవమానించే ప్రయత్నం చేశాడు.

దీనిపై విజయ్ దేవరకొండ టీం సీరియస్ అయ్యారు. వెంటనే అతడి గురించి సైబర్ పోలీసులకు కంప్లైంట్ చేయగా.. అతని అరెస్ట్ చేసిన పోలీసులు యూట్యూబర్‌ ఛానల్‌ని, విజయ్ హీరోయిన్స్‌పై క్రియేట్ చేసిన బ్యాడ్ వీడియోలను డిలీట్ చేయించారు. ఇక భవిష్యత్తులో మళ్లీ ఎలాంటి బ్యాడ్ రూమర్స్ సృష్టించిన సోషల్ మీడియా వేదికలో అసభ్యకరమైన కామెంట్స్ చేసిన.. అతడిపై కఠినమైన చర్యలు తీసుకుంటామంటూ హెచ్చరించిన పోలీసులు కొంత కౌన్సిలింగ్ ఇచ్చి యూట్యూబర్‌ని రిలీజ్ చేశారు.