” ఓ మై బేబీ ” ని మింగేసిన ” సూరిడు “…. ప్రభాస్ పాట రికార్డుల వేట…!!

రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా.. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కనున్న లేటెస్ట్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ ” సలార్ “. ఇక ఈ సినిమాలో శృతిహాసన్ హీరోయిన్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే. అలాగే సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా.. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్లో రానున్న మూవీ ” గుంటూరు కారం “. ఈ ఇద్దరి స్టార్ సినిమాల కోసం ఆడియన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నారు.

ఇక ఈ స్టార్ సినిమా లోనుంచి కొద్దిసేపటి క్రితమే సాంగ్స్ రిలీజ్ చేశారు మేకర్స్. ఇందులో గుంటూరు కారం సినిమా నుంచి సెకండ్ సింగిల్ ” ఓ మై బేబీ ” సాంగ్ రిలీజ్ సలార్ మూవీ నుంచి ఫస్ట్ సింగిల్ ” సూర్యుడే ” అనే సాంగ్ ని రిలీజ్ చేశారు మేకర్స్‌. ఇక ఈ రెండు సినిమాల నుంచి సాంగ్స్ కొంత సమయం వ్యవధిలోనే రిలీజ్ అయ్యాయి.

అయితే మహేష్ గుంటూరు కారం సెకండ్ సాంగ్ రెండు గంటలకి 7,85,441 వ్యూస్ రాగా… సలార్ ” సూర్యుడే ” సాంగ్ కి 1.3M వ్యూస్ వచ్చాయి. అంటే మహేష్ సాంగ్ మీద.. ప్రభాస్ సాంగ్ కి పెద్ద ఎత్తున రెస్పాన్స్ వచ్చింది. ఇక దీని బట్టి చూస్తుంటే… మహేష్ ” ఓ మై బేబీ ” పాటని సలార్ ” సూర్యుడే ” సాంగ్ మింగేసిందనే చెప్పాలి. ఇక ప్రభాస్ పాట రికార్డుల వేట అనేలా మరోసారి… తనేంటో ప్రూవ్ చేసుకున్నాడు ప్రభాస్. ఇక ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.