” సలార్ ” మూవీలో ప్రభాస్ ఎంట్రీ ఆలస్యం… ఏకంగా అంత టైం వరకు రాడా..!!

కమర్షియల్ సినిమాల పద్ధతే వేరు. ముందుగా ప్రతి ఒక ఆడియన్ చూసేది హీరో ఎప్పుడూ వస్తాడా అని. హీరో వచ్చిన వెంటనే ఆ హీరో ఫ్యాన్స్ ఏ రేంజ్ లో ఖుషి అవుతారు ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇక ఇదే నేపథ్యంలో దర్శకులు సైతం హీరోను ఎంత త్వరగా తెరపైకి తీసుకొద్దామా అనేలా ప్లాన్ చేసుకుంటారు. కానీ తాజాగా ప్రభాస్ నటిస్తున్న పాన్ ఇండియా మూవీ ” సలార్ ” లో హీరో ఎంట్రీ లేట్ గా రానుంది అంటూ ప్రచారం జరుగుతుంది.

ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ మూవీలో శృతిహాసన్ హీరోయిన్గా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ మూవీ అనౌన్స్ చేసిన నాటి నుంచి భారీ హైప్ నెలకొంది. ఈ సినిమా ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుద్దా అని ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఇక ఈ సినిమాలో ప్రభాస్ రోల్ సినిమా మొదలైన 20 నిమిషాల తరువాత రానుందని టాక్.

తొలి 10 నిమిషాలు చైల్డ్ ఎపిసోడ్ తో కొనసాగుతుందట. మిగిలిన 10 నిమిషాలు బిల్డప్ సీన్స్ తో సరిపెట్టనున్నారట. ఇక అనంతరం ప్రభాస్ ఎంట్రీ ఉండనుందట. ఈ వార్త తెలుసుకున్న ప్రభాస్ అభిమానులు.. చాలా డిసప్పాయింట్ అవుతున్నారు. ఇక ఈ కారణం చేత.. ఈ మూవీ కి దెబ్బ డే అవకాశం కూడా ఉంది. ఇక ఈ వార్తలో ఎంతవరకు నిజం ఉందో తెలియదు కానీ… ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.