చెర్రీ – బుచ్చిబాబు సినిమాలో హీరోయిన్ గా ఆ యంగ్ బ్యూటీ.. పక్కా సూపర్ హిట్ అంటున్న ఫ్యాన్స్…!

టాలీవుడ్ స్టార్ హీరో రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు దర్శకత్వంలో తెరకెక్కనున్న లేటెస్ట్ యాక్షన్ మూవీ ” గేమ్ చేంజర్ ” పై మెగా అభిమానులతో పాటు ఆడియన్స్ లో కూడా మంచి అంచనాలు నెలకొన్నాయి. చాలా నెలల క్రితమే అనౌన్స్ చేసిన ఈ మూవీ ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. ఈ క్రమంలోనే ఈ సినిమా గురించి కొన్ని ఆసక్తికర విషయాలు బయటకు వస్తున్నాయి. ఇక తాజాగా ఈ మూవీలో ఇద్దరు హీరోయిన్లు ఉండబోతున్నట్లు తెలిసింది.

అలాగే అందులో ఓ హీరోయిన్ పేరును దాదాపు ఖరారు కూడా చేశారన్నట్లు సమాచారం. అలా ఈ సినిమాలో ఇద్దరు నాయకులు చుట్టు ఈ కథను నడుపుతారట. తొలుత ఒక నాయక ఉన్నప్పుడు ఆ పాత్ర జాహ్నవి కపూర్ చేస్తుందని చెప్పారు. ఇక తర్వాత వేరే బాలీవుడ్ హీరోయిన్ తనయను అనుకుంటున్నారు అంటూ వార్తలు వినిపించాయి. ఇక ఇప్పుడు వినిపిస్తున్న సమాచారం ప్రకారం ఈ సినిమాలో ఇద్దరూ ఉండనున్నారట.

అందులో ఓ హీరోయిన్ కియారా అడ్వాణీ అయినట్లు సమాచారం. ఇప్పటికే వినయ విధేయ రామ అనే సినిమాలో ఇద్దరూ కలిసి నటించారు. ఇక ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ కూడా అయ్యింది. ఇక ఈ జంటే ” గేమ్ చేంజర్ ” లో కూడా నటిస్తే ఈ మూవీ కూడా సూపర్ హిట్ అవుతుందని ప్రేక్షకులు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఈ జంట చూడడానికి చాలా బాగుంటుంది అంటూ కామెంట్స్ సైతం చేస్తున్నారు. ఇక ఈ వార్తలో ఎంతవరకు నిజం ఉందో తెలియదు కానీ ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.