ఇండస్ట్రీలో మరో పెళ్లి భాజాలు.. రెండో వివాహం చేసుకోబోతున్న నటుడు..!

బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ కొడుకు, నటుడు అర్బాజ్ ఖాన్ వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. ఇక కొన్నేళ్లుగా ఓ యువతితో డేటింగ్ లో ఉన్న ఈయన ఎట్టకేలకు ఆమెని రెండో వివాహం చేసుకున్నాడు. ఈ మేరకు కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో అప్లోడ్ చేశాడు. ఇప్పటికే అర్బాజ్ కు నటి మలైకా అరోరా తో వివాహం అయ్యి.. విడాకులు కూడా అయిన సంగతి తెలిసిందే.

ఇక ఇప్పుడు ఈయన రెండో పెళ్లి చేసుకున్న ఆమె మేకప్ ఆర్టిస్ట్ సురా ఖాన్. అర్బాజ్ వివాహం తన సోదరి ఇంట్లో సింపుల్ గా జరిగింది. ఇక ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక అర్బాజ్ ఖాన్, మలైకా అరోరా బాలీవుడ్ బెస్ట్ కపుల్ గా చాలా ఏళ్లు ఉన్నారు.

19 ఏళ్ల కాపురం చేసిన ఈ జంట కొన్నేళ్ల క్రితం సడన్గా విడిపోయారు. ఇక తమ విడిపోతున్నామంటూ 2016లో ప్రకటించారు. ఆ తర్వాత 2017 లో అధికారికంగా విడాకులు తీసుకున్నారు. ఇక అనంతరం మలైకా అరోరా నటుడు అర్జున్ కి దగ్గర అయింది. ఇక ప్రస్తుతం అర్బాజ్ ఖాన్ కి పెళ్లయిపోవడంతో అందరి చూపు మలైకా అరోరా పై పడింది. ఇక మలైకా అరోరా కంటే అర్జున్ 12 ఏళ్ల చిన్నవాడు అనే సంగతి తెలిసిందే.

 

 

View this post on Instagram

 

A post shared by Arbaaz Khan (@arbaazkhanofficial)