రవితేజ ” ఈగిల్ ” రన్ టైం లాక్… రాసుకోండి రా బాబాయ్ లు..!

మాస్ మహారాజ్ రవితేజ మనందరికీ సుపరిచితమే. ఇటీవల పాన్ ఇండియా మూవీ టైగర్ నాగేశ్వరరావు ద్వారా ఆడియన్స్ ముందుకి వచ్చిన రవితేజ మంచి సక్సెస్ ని అందుకున్నాడు. ఇక ప్రస్తుతం యువ దర్శకుడు కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో ” ఈగిల్ ” అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.

మాస్ యాక్షన్ తో కూడిన త్రిల్లింగ్ ఎంటర్టైనర్ మూవీ ఈగిల్ లో అనుపమ పరమేశ్వరన్, కావ్యథాఫర్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ సంస్థ ఈ మూవీని గ్రాండ్ లెవెల్ లో నిర్మిస్తుంది. ఇక ఇటీవలే ఈ మూవీ నుంచి రిలీజ్ అయిన ఫస్ట్ సాంగ్ తో పాటు ఫస్ట్ లుక్, టీజర్ అందరినీ ఓ రేంజ్ లో ఆకట్టుకున్నాయి.

ఇక రేపు థియేటర్ ట్రైలర్ ని రిలీజ్ చేయనున్నారు మేకర్స్. ఇక లేటెస్ట్ టాలీవుడ్ బజ్‌ ప్రకారం ఈ మూవీ యొక్క రన్ టైం 2 గం.20 ని.ల నుంచి 2 గం.25 ని.ల మధ్య ఉండనున్నట్లు సమాచారం. ఇక దీనిపై మేకర్స్ నుంచి అఫీషియల్ అనౌన్స్మెంట్ రావాల్సి ఉంది. ఇక ఈ మూవీ సంక్రాంతి కానుకగా జనవరి 13న ఆడియన్స్ ముందుకి గ్రాండ్ లెవెల్ లో రానుంది.