‘ స‌లార్ ‘ లో ఐటెం సాంగ్ కిరికిరి మొద‌లైందా…!

ప్రభాస్ హీరోగా… శృతిహాసన్ హీరోయిన్గా.. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కనున్న లేటెస్ట్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ ” సలార్ “. ఈ సినిమాపై ప్రభాస్ అభిమానులతో పాటు ఆడియన్స్ లో కూడా మంచి అంచనాలు నెలకొన్నాయి. ఇక ఇప్పటికే ఈ సినిమా నుంచి ఓ పాట రిలీజ్ చేశారు. ఇక ఈ సాంగ్ ప్రేక్షకులని ఓ రేంజ్ లో ఆకట్టుకుంది. ఇక ప్రస్తుతం మరో పాట రిలీజ్ చేయనున్నారట మేకర్స్. ఇది కూడా ఫస్ట్ టైప్ ఆఫ్ సాంగ్ ఏ అట.

ఇక ఈ సినిమా నుంచి రిలీజ్ చేయబోయే సెకండ్ సాంగ్ అర్థవంతంగా ఉంటుందట. ఇక ఫ్యాన్స్ ఎదురుచూసేది ఈ సాంగ్స్ కోసం అస్సలు కాదు. మొత్తం అందరూ ఎదురుచూసేది ఈ సినిమాలోని ఐటమ్ సాంగ్ కోసం. ఈ సినిమా కోసం కొన్ని రోజుల క్రితం ఐటమ్ సాంగ్ చిత్రీకరించారని వార్తలు వినిపించాయి. అనంతరం స‌లార్ రెండు భాగాలా? ఒక భాగం అన్న వార్తలు సైతం వినిపించాయి.

ఇక ప్రస్తుతం ఓ ఫైట్, ఐటమ్ సాంగ్ యాడ్ చేశారని. ఈ క్రమంలోనే ఈ ఐటెం సాంగ్ను ఫస్ట్ పార్ట్ నుంచి తీసేసినట్లు తెలుస్తుంది. ఈ పాటను రెండో భాగానికి షిఫ్ట్ చేశారట మేకర్స్. కానీ ఐటెం సాంగ్ ఉంటేనే తొలి సగం బాగుంటుందని.. కేవలం ఫైట్లు మాత్రమే కాదు.. ఐటెం సాంగ్ కూడా కీలకమే అని ఫ్యాన్స్ ఫీల్ అవుతున్నారు. ఇక దీనిపై అఫీషియల్ అనౌన్స్మెంట్ రావాల్సి ఉంది. ఇక ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.