సూర్య ” కంగువా ” మూవీ పై ఇంట్రెస్టింగ్ అప్డేట్..!

సూర్య ప్రధాన పాత్రలో నటిస్తున్న కోలీవుడ్ మూవీ ” కంగువా ” పై భారీ అంచనాలు నెలకొన్న సంగతి తెలిసిందే. సిరుత్ర్తె శివ దర్శకత్వంలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దిశా పటానీ లేడీ లీడ్ రోల్లో నటించనుంది. ఇక ఈ సినిమా 2024 సమ్మర్ లో ప్రేక్షకుల ముందుకి రానుంది.

ఇక ప్రస్తుతం చిత్ర బంధం హైదరాబాదులో షూటింగ్ జరుపుకుంటున్న తరుణంలో ఓ ఆసక్తికర వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. బాబీ డియోల్ మరియు ఇతర నటీనటులు ఇప్పటికే ఈ మూవీలో భాగమయ్యారు. సూర్య వీరితో మరికొన్ని రోజుల్లో జాయిన్ అవ్వనున్నట్లు తెలుస్తుంది. ఈ షూట్లో సూర్య పార్ట్ ను పూర్తి చేస్తారని సమాచారం.

యు వి క్రియేషన్స్ తో కలిపి స్టూడియో గ్రీన్ భారీ స్థాయిలో నిర్మిస్తున్న ఈ మూవీకి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. ఇక ఈ సినిమా 38 భాషల్లో రిలీజ్ కానుంది. అంతేకాకుండా ఈ మూవీ 3డీ మరియు ఐ మ్యాక్స్ ఫార్మాట్ లలో విడుదల కానుంది. ఇక ఈ సినిమాపై సూర్య అభిమానులతో పాటు ఆడియన్స్ లో కూడా మంచి అంచనాలు నెలకొన్నాయి. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది