పరారీలో బిగ్ బాస్ విన్నర్ ‘ పల్లవి ప్రశాంత్ ‘ .. రైతు బిడ్డకు అరెస్ట్ తప్పేలా లేదే..

బిగ్‌బాస్ సీజన్ సెవెన్ ఇంట్ర‌స్టింగ్‌గా కొనసాగిన సంగతి తెలిసిందే. ఇటీవల ఈ సీజన్‌కు ఎండ్ కార్డ్ పడింది. కామన్ మ్యాన్‌గా హౌస్ లోకి అడుగుపెట్టిన రైతుబిడ్డ టైటిల్ గెలుచుకొని బిగ్ బాస్ విన్నార్‌గా గెలిచాడు. బుల్లితెర నటుడు బీటెక్ విద్యార్థి అమర్‌దీప్ రన్నర్ ఆఫ్ గా నిలిచారు. ఇక సీజన్ మొదలైన దగ్గర నుంచి అమర్, ప్రశాంత్ ఫ్యాన్స్ మధ్యలో బీభత్సంగా గొడవలు జరుగుతున్నాయి. పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్ అసభ్య పదజాలం వాడుతున్నారని అమర్ తల్లి కొన్ని వీడియోలను కూడా రిలీజ్ చేసింది.

ఇక ఫినాలే రోజు అమర్, పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్ భారీగా అన్నపూర్ణ స్టూడియోకి చేరుకోవడంతో ఇరువురి ఫ్యాన్స్ మధ్యన గొడవలు మొదలయ్యాయి. కొట్టుకునేదాకా వెళ్లడంతో పరిస్థితిని గమనించిన పోలీసులు పల్లవి ప్రశాంత్ ని బ్యాక్ డోర్ నుంచి వెళ్ళిపోమని.. బయట గొడవగా ఉందని.. దయచేసి అన్నపూర్ణ స్టూడియోస్ వద్దకు మీరు రావద్దు అంటూ చెప్పారు. అయినా వినకుండా ప్రశాంత్ ఓపెన్ టాప్ కారులో అన్నపూర్ణ స్టూడియోకి వచ్చాడు. దాంతో గొడవ మరింత పెరిగింది. పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్ అమర్, గీతు రాయల్, అశ్విని కార్లను ధ్వంసం చేసి ఆర్టీసీ బస్సులు, ప్రైవేట్ వాహనాల పైన కూడా దాడి చేశారు.

దీంతో సీరియస్ ఆయన పోలీసులు పలు సెక్షన్ల కింద పల్లవి ప్రశాంత్ పై కేసు నమోదు చేసి అరెస్ట్ వారెంట్ జారీ చేశారు. ఇక ప్రస్తుతం ప్రశాంత్‌ని అరెస్ట్ చేసేందుకు గాలింపులు చేపట్టారు. అలాగే పల్లవి ప్రశాంత్ బ్రదర్ పరశురాం కోసం కూడా ఒక టీం సెర్చ్‌ చేస్తున్నారు. కారు డ్రైవర్ సాయికిరణ్‌ని ఇప్పటికే అరెస్ట్ చేశారు. మొత్తం మూడు టీంలు వెతుకుతున్నారు. ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి పరారీలో ఉన్న ప్రశాంత్ కొమరపల్లి సమీపంలో ఉన్నాడని తెలియడంతో పోలీసులు అక్కడ సెర్చింగ్స్ స్టార్ట్ చేశారు. దీని బ‌ట్టి ప్ర‌శాంత్ అరెస్ట్‌ తప్పదని తెలుస్తుంది