రెబల్ స్టార్ పాన్ ఇండియా హీరో ప్రభాస్ ఇటీవల నటించిన మూవీ సలార్. కే జి ఎఫ్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీ డిసెంబర్ 22న క్రిస్మస్ కానుకగా పాన్ ఇండియా లెవెల్ లో గ్రాండ్గా రిలీజ్ కాబోతుంది. ఇక సలార్ టికెట్స్ కోసం రెబల్ స్టార్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న సంగతి తెలిసిందే. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ సలార్ అడ్వాన్స్ బుకింగ్స్ నిన్ననే మొదలైపోయాయి. ఈ విషయాన్ని నిర్మణ సంస్థ హోంబాలే ఫిలిమ్స్, నైజం లో డిస్ట్రిబ్యూట్ చేస్తున్న మైత్రి మూవీ మేకర్ తమ ట్విట్టర్ అకౌంట్ ద్వారా షేర్ చేసుకున్నారు.
దీంతో మంగళవారం రాత్రి 8;24 గంటలకు ఫ్యాన్స్ అంతా బుక్ మై షో ను ఒకేసారి ఓపెన్ చేశారు. తెలంగాణ, ఏపీ థియేటర్ టికెట్స్ బుకింగ్ ఓపెన్ చేయడమే ఆలస్యం వెంటనే ప్రభాస్ ఫ్యాన్స్ అంతా ఒక్కసారిగా లక్షలాదిమంది బుక్ మై షో ఆప్ ను ఓపెన్ చేయడంతో యాప్ కాసేపు పనిచేయడం ఆగిపోయింది. ఇక బుక్ మై షో క్రాష్ అవ్వడంతో పలువురు ఈ పిక్ ను సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు. అందులో భాగంగానే బాహుబలి ప్రొడ్యూసర్ లో ఒకరైన శోభు యార్లగడ్డ కూడా సలార్ ఎఫెక్ట్.. బుక్ మై షో క్రాష్ అంటూ ట్యాగ్ చేసి ఆ ఇమేజ్ను షేర్ చేశాడు.
యాప్ క్రష్ కావడంతో కాసేపు ఆగిపోయిన బుక్ మై షో ఆ తర్వాత అన్ని థియేటర్స్ ను ఒకేసారి టికెట్స్ బుకింగ్‌కి ఓపెన్ చేయకుండా నెమ్మదిగా ఒక్క ధియేటర్ బుకింగ్స్ ఓపెన్ చేసింది. ఇలాగే గతతంలో నందమూరి బాలయ్య హోస్ట్‌గా వ్యవహరించిన అన్‌స్టాపబుల్ టాక్ షో కి ప్రభాస్ గెస్ట్ గా వచ్చినప్పుడు కూడా ఆ షో స్ట్రీవింగ్ రోజున ఒకేసారి లక్షల్లో జనం ఓపెన్ చేశారు. దీంతో అప్పుడు ఆహా యాప్ క్రష్ అయింది. ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవడంతో.. ప్రభాస్ అన్నతో అట్లుంటది అంటూ ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు.
#Salaar effect ! #Prabhas !!👍 pic.twitter.com/v3WyFTuThH
— Shobu Yarlagadda (@Shobu_) December 19, 2023